IND vs CAN : కెన‌డాతో మ్యాచ్‌.. టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో గ్రూప్‌ స్టేజీలో టీమ్ఇండియా త‌న ఆఖ‌రి మ్యాచ్‌కు సిద్ధ‌మైంది.

IND vs CAN : కెన‌డాతో మ్యాచ్‌.. టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

T20 World Cup 2024 India vs Canada game likely to be rained out

India vs Canada : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో గ్రూప్‌ స్టేజీలో టీమ్ఇండియా త‌న ఆఖ‌రి మ్యాచ్‌కు సిద్ధ‌మైంది. ఫ్లోరిడా వేదిక‌గా నేడు (జూన్ 15 శనివారం) కెన‌డాతో త‌ల‌ప‌డ‌నుంది. భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే సూప‌ర్ 8కి అర్హ‌త సాధించ‌డంతో ఈ మ్యాచ్ నామ‌మాత్రంగా మారింది. అయితే.. గ్రూప్ ద‌శ‌ను అజేయంగా ముగించాల‌ని టీమ్ఇండియా భావిస్తోంది.

న్యూయార్క్‌లో అస్థిర బౌన్స్‌కు సహకరించి, మందకొడిగా వ్యవహరించిన పిచ్‌పై వరుసగా మూడు మ్యాచ్‌లాడిన టీమ్ఇండియా ఈ మ్యాచ్‌ను ఫోర్లిడాలో ఆడ‌నుంది. సాధార‌ణంగా ఇక్క‌డి పిచ్ బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామం. దీంతో భార‌త బ్యాట‌ర్ల ప‌రుగుల వ‌ర‌ద చూడొచ్చున‌ని స‌గ‌టు అభిమాని భావిస్తున్నాడు. అయితే.. వారికి ఇది నిజంగా షాకింగ్ విష‌య‌మే.

Bye Bye Pakistan : ఆజం ఖాన్ పాక్‌కు వెళ్ల‌డు.. బై బై పాకిస్తాన్ ట్రెండింగ్‌.. మీమ్స్ వైర‌ల్‌

తాను ఉన్నాన‌ని వ‌రుణుడు అంటున్నాడు. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వ‌ర్షం కురిసేందుకు 86 శాతం అవ‌కాశం ఉంద‌ని స్థానిక వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. మ్యాచ్‌కు ముందు కూడా వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పింది.

కాగా.. మంగ‌ళ‌వారం ఇక్క‌డ జ‌ర‌గాల్సిన నేపాల్‌, శ్రీలంక మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్ద‌యింది, శుక్ర‌వారం అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ కూడా వ‌ర్షార్ఫ‌ణ‌మైంది. దీంతో నేడు జ‌ర‌గాల్సిన భార‌త్, కెన‌డా మ్యాచ్‌కు ర‌ద్దైయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

SA vs NEP : లక్ష‌లాది మంది నేపాల్ అభిమానుల‌ హృద‌యం ముక్క‌లైంది.. ఉత్కంఠ పోరులో ఒక్క ప‌రుగుతో సౌతాఫ్రికా పై ఓట‌మి