SA vs NEP : లక్ష‌లాది మంది నేపాల్ అభిమానుల‌ హృద‌యం ముక్క‌లైంది.. ఉత్కంఠ పోరులో ఒక్క ప‌రుగుతో సౌతాఫ్రికా పై ఓట‌మి

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో పెను సంచ‌ల‌నం తృటిలో త‌ప్పింది.

SA vs NEP : లక్ష‌లాది మంది నేపాల్ అభిమానుల‌ హృద‌యం ముక్క‌లైంది.. ఉత్కంఠ పోరులో ఒక్క ప‌రుగుతో సౌతాఫ్రికా పై ఓట‌మి

PIC credit : ICC

South Africa vs Nepal : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో పెను సంచ‌ల‌నం తృటిలో త‌ప్పింది. సెయింట్ విన్సెంట్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఉత్కంఠ పోరులో నేపాల్ ఒక్క ప‌రుగు తేడాతో ఓడిపోయింది. 116 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నేపాల్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల వికెట్ల న‌ష్టానికి 115 ప‌రుగులు చేసింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో రీజా హెండ్రిక్స్(49 బంతుల్లో 43 ప‌రుగులు), ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 27 నాటౌట్‌) లు రాణించారు. క్వింట‌న్ డికాక్ (10), కెప్టెన్ మార్‌క్ర‌మ్‌(15), క్లాస‌న్ (3), డేవిడ్ మిల్ల‌ర్ (7) లు విఫ‌లం అయ్యారు. నేపాల్ బౌల‌ర్ల‌లో కుశాల్ భుర్టెల్ నాలుగు వికెట్లు, దీపేంద్ర సింగ్ మూడు వికెట్లు తీశాడు.

Pakistan: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌.. ఆతిథ్య జ‌ట్టుకు సాయం చేసిన వ‌రుణుడు.. గ‌గ్గొలు పెడుతున్న పాక్ ఫ్యాన్స్‌

అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి మూడు వికెట్లు కోల్పోయి 86 ప‌రుగుల‌తో నేపాల్ గెలుపు దిశ‌గా వెలుతోంది. ఈ స‌మ‌యంలో మ‌రో సంచ‌ల‌నం త‌ప్ప‌దేమోన‌ని చాలా మంది భావించారు. అయితే.. పుంజుకున్న ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వికెట్లు తీసి నేపాల్ ను అడ్డుకున్నారు.

ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 8 ప‌రుగులు..

నేపాల్ విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. స‌ఫారీ పేస‌ర్ ఒట్నీల్ బార్ట్‌మాన్ ఈ ఓవ‌ర్‌ను వేశాడు. మూడో బంతికి గుల్సన్ ఝా ఫోర్ కొట్ట‌గా, నాలుగో బంతికి రెండు ప‌రుగులు తీశాడు. దీంతో విజ‌య స‌మీక‌ర‌ణం 2 బంతుల్లో 2 ప‌రుగులుగా మారింది. ఐదో బంతికి డాట్ కాగా.. ఆరో బంతికి ర‌నౌట్ అయ్యాడు. దీంతో స‌పారీలు ప‌రుగు తేడాతో గెలిచారు.

ENG vs Oman : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌.. 3.1 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్య ఛేద‌న‌

నేపాల్ బ్యాట‌ర్ల‌లో ఆసిఫ్ షేక్ (49 బంతుల్లో 42), అనిల్ సాహ్ (24 బంతుల్లో 27) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో తబ్రైజ్ షమ్సీ నాలుగు వికెట్లు తీశాడు. మార్‌క్ర‌మ్‌, నోర్జేలు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఒక్క ప‌రుగు తేడాతో ఓడిపోవ‌డంతో నేపాల్ ఆట‌గాళ్ల‌తో పాటు ల‌క్ష‌లాది మంది ఆ జ‌ట్టు అభిమానులు నిరాశ‌లో మునిగిపోయారు.  ఈ ఓట‌మితో నేపాల్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ రేసు నుంచి నిష్ర్క‌మించింది.