Bye Bye Pakistan : ఆజం ఖాన్ పాక్‌కు వెళ్ల‌డు.. బై బై పాకిస్తాన్ ట్రెండింగ్‌.. మీమ్స్ వైర‌ల్‌

అనుకున్న‌దే జ‌రిగింది. అద్భుతాలు ఏమీ న‌మోదు కాలేదు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 నుంచి పాకిస్తాన్ జ‌ట్టు నిష్ర్క‌మించింది.

Bye Bye Pakistan : ఆజం ఖాన్ పాక్‌కు వెళ్ల‌డు.. బై బై పాకిస్తాన్ ట్రెండింగ్‌.. మీమ్స్ వైర‌ల్‌

Internet in overdrive after Pakistan early exit from T20 World Cup

Bye Bye Pakistan Trending : అనుకున్న‌దే జ‌రిగింది. అద్భుతాలు ఏమీ న‌మోదు కాలేదు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 నుంచి పాకిస్తాన్ జ‌ట్టు నిష్ర్క‌మించింది. శుక్ర‌వారం ఫ్లోరిడా వేదిక‌గా అమెరికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే ర‌ద్దైంది. దీంతో ఇరు జ‌ట్ల‌కు అంపైర్లు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు. ఈ క్ర‌మంలో మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే పాకిస్తాన్ మూటాముళ్లు స‌ర్దుకోవాల్సి వ‌చ్చింది.

ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌లో అమెరికా, రెండో మ్యాచ్‌లో భార‌త్ చేతిలో ఓడిపోవ‌డంతో పాకిస్తాన్ సూప‌ర్ 8 అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. మూడో మ్యాచ్‌లో కెన‌డా పై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన పాకిస్తాన్ త‌న ఆఖ‌రి లీగ్‌ల మ్యాచ్‌లో గెలిచి ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాలు క‌లిసి వ‌స్తే సూప‌ర్ 8కి చేరే అవ‌కాశాలు ఉండేవి. అయితే.. అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ ర‌ద్దు కావ‌డం పాక్ కొంప‌ముంచింది.

NZ vs UGA : ఇప్పుడాదితే ఏం లాభం.. అంతా అయిపోయిందిగా.. కివీస్ సంచ‌ల‌నం.. 5.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్య ఛేద‌న‌

గ్రూపు ఏలో భార‌త్ ఇప్ప‌టికే సూప‌ర్ 8కి చేర‌గా అమెరికా ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్ త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ఆదివారం ఐర్లాండ్ పై విజ‌యం సాధించినా కూడా ఆ జ‌ట్టు పాయింట్ల సంఖ్య గ‌రిష్టంగా నాలుగు పాయింట్ల‌కే చేరుకుంటుంది. ఈ క్ర‌మంలో అమెరికా అధికారికంగా సూప‌ర్ 8కి చేరుకుంది.

ఇక గ్రూప్ ద‌శ నుంచే పాకిస్తాన్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఔట్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో బై బై పాకిస్తాన్ అనే హ్యాష్ ట్యాగ్ వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు ఫ‌న్నీ మీమ్స్‌ను పోస్ట్ చేస్తున్నారు.

SA vs NEP : లక్ష‌లాది మంది నేపాల్ అభిమానుల‌ హృద‌యం ముక్క‌లైంది.. ఉత్కంఠ పోరులో ఒక్క ప‌రుగుతో సౌతాఫ్రికా పై ఓట‌మి