టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో టీమిండియా ఏఏ జట్లతో ఎప్పుడు తలపడుతుందో తెలుసా..

గ్రూప్-ఎలో పాయింట్ల పట్టికలో టీమిండియా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా( అమెరికా) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

T20 World Cup 2024 : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. పసికూన జట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పెద్ద జట్లకు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు సూపర్ -8కు అర్హత కోల్పోయాయి. శనివారం రాత్రి ఇండియా వర్సెస్ కెనడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటికే భారత్ సూపర్ -8కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన టీమిండియా మూడు మ్యాచ్ లలో విజయం సాధించగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

Also Read : IND vs CAN : టీ20 ప్రపంచ కప్.. భారత్, కెనడా మ్యాచ్‌ రద్దు.. కారణం ఇదే!

గ్రూప్-ఎలో పాయింట్ల పట్టికలో టీమిండియా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా( అమెరికా) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. టీమిండియాతోపాటు గ్రూప్ -ఎ నుంచి అమెరికా జట్టు కూడా సూపర్ -8లోకి ప్రవేశించింది. అమెరికా పాకిస్థాన్, కెనడా జట్లను ఓడించగా.. భారత్ చేతిలో ఓడిపోయింది. కెనడా జట్టు మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లు నిలిచాయి. ఆదివారం రాత్రి ఐర్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

Also Read : Bye Bye Pakistan : ఆజం ఖాన్ పాక్‌కు వెళ్ల‌డు.. బై బై పాకిస్తాన్ ట్రెండింగ్‌.. మీమ్స్ వైర‌ల్‌

గ్రూప్ -ఎ నుంచి టీమిండియా, అమెరికా జట్లు సూపర్ -8కి చేరుకున్నాయి. ఈ దశలో భారత జట్టు జూన్ 20న బార్బడోస్ లో ఆఫ్గనిస్థాన్ తో తలపడనుంది. జూన్ 22న ఆంటిగ్వాలో బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లలో ఒకదానితో తలపడుతుంది. ఆ తరువాత జూన్ 24న సెయింట్ లూసియాలో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. సూపర్ -8లో భారత్ కు చెందిన అన్ని మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటల నుంచి ప్రారంభం అవుతాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు