Vijay Devarakonda: రౌడీ హీరో ఆశలన్నీ లైగర్‌పైనే.. గేమ్ ఛేంజర్ అవుతుందా?

ప్రతి హీరోకి.. కెరీర్ లో హిట్, ఫ్లాప్ కామన్. కెరీర్ లో ఎన్ని హిట్లొచ్చినా.. అంతవరకూ జస్ట్ హీరోగా ఉన్న వాళ్లని స్టార్ హీరోగా నిలబెట్టిన టర్నింగ్ పాయింట్ మూవీ ఒకటుంటుంది.

Vijay Devarakonda: ప్రతి హీరోకి.. కెరీర్ లో హిట్, ఫ్లాప్ కామన్. కెరీర్ లో ఎన్ని హిట్లొచ్చినా.. అంతవరకూ జస్ట్ హీరోగా ఉన్న వాళ్లని స్టార్ హీరోగా నిలబెట్టిన టర్నింగ్ పాయింట్ మూవీ ఒకటుంటుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ అలాంటి ఫేజ్ లోనే ఉన్నాడు. లైగర్ తన గేమ్ చేంజింగ్ మూవీ అవుతుందంటున్నాడు.

Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?

అప్పటి వరకూ నార్మల్ హీరోగా ఉన్న వాళ్లని స్టార్ హీరోల్ని చేసేస్తుంది ఓ సినిమా. అప్పటి వరకూ ఎన్ని ఫ్లాపులున్నా ఓ సినిమా కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అవుతుంది. యాక్టింగ్ వైజ్ గా, కలెక్షన్ల పరంగా బిగ్ సక్సెస్ అవుతుంది. ఇలాంటి సక్సెస్, ఇలాంటి టర్నింగ్ పాయింట్ విజయ్ దేవరకొండ కెరీర్ లో లైగర్ అవుతుందని కాన్ఫిండెంట్ గా ఉన్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో ఫేమ్, క్రేజ్ తెచ్చుకున్న విజయ్.. బిగ్గెస్ట్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి క్రేజ్ తెచ్చిపెట్టినా.. కమర్షియల్ గా 100కోట్లు కలెక్ట్ చేసి మంచి సక్సెస్ ఇచ్చిన మూవీ గీతగోవిందం. ఈసినిమా తర్వాత వరసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ కి.. లైగర్ టర్నింగ్ పాయింట్ అవ్వబోతోంది. పూరీజగన్నాధ్ డైరెక్షన్లో కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో పాన్ ఇండియా లెవల్లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ విలన్ గా నటిస్తున్న లైగర్ మూవీ తన కెరీర్ గ్రాఫ్ నే మార్చేస్తుందన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తోఉన్నాడు. లేటెస్ట్ గా ఈ భారీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్.. అగస్ట్ 25న తన కెరీర్ లో గేమ్ చేంజర్ కాబోతున్న లైగర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

F3 Movie: లబ్ డబ్ డబ్బో.. పైసా ఉంటే ప్రపంచమే పిల్లి!

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా.. మైల్ స్టోన్ మూవీ మాత్రం మిర్చి. మిర్చికి ముందు హీరోగా మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే కొరటాలతో చేసిన మిర్చి మూవీతో పెద్ద కమర్షియల్ హిట్ అందుకుని ఒక్కసారిగా తన స్కేల్ ని పెంచేసుకున్నాడు. ఇక బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ.. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా క్రేజ్ బిల్డప్ చేసుకుంటున్నాడు.

Sarkaru Vaari Paata: ఇక ఆగడు.. ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మహేశ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా 20 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఒక్కడు సినిమాతో ఆడియన్స్ ని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పోకిరి మహేష్ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది. పూరీ జగన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మాస్ కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో టాప్ స్టార్ అయిపోయాడు. అప్పటినుంచి ఎన్ని సినిమాలు చేసినా.. మహేష్ కెరీర్ లో పోకిరి క్రేజ్ ని రీప్లేస్ చెయ్యలేకపోయాయి.

Khiladi: ఈ వారమే ఖిలాడీ రిలీజ్.. ప్రమోషన్ల హడావుడి లేదేంటి?

చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ మాస్ హీరోగా ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్టూడెంట్ నెం.1 తో పొటెన్షియల్ ఉన్న హీరోగా కనిపించినా .. ఆది సినిమాతో అసలు సిసలు మాస్ హీరోగా అవతరించాడు. ఇక సింహాద్రితో తన కెరీర్ లో టర్నింగ్ సక్సెస్ అందుకున్నారు. అటు డాన్స్, యాక్షన్, ఎమోషన్ తో అన్ని రకాలుగా అటు క్లాస్, మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేశారు. ఇప్పుడు కెరీర్ లో మరో మైల్ స్టోన్ అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. ట్రిపుల్ఆర్ తో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తూ.. పాన్ ఇండియా స్టార్ గా కొత్త టర్న్ తీసుకోబోతున్నారు.

Rajinikanth: విజయ్ దర్శకుడితో సూపర్ స్టార్ కథా చర్చలు.. ఫైనల్ అయ్యేనా?

మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఫాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటున్న రామ్ చరణ్ కూడా స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి వరసగా సినిమాలు చేస్తున్నా.. మగధీరతోనే తన కెరీర్ హిట్ అందుకున్నాడు. అప్పటి వరకూ రొటీన్ యాక్షన్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన చరణ్.. మగధీరతో తన విశ్వరూపం చూపించాడు. యాక్షన్, డిక్షన్, ఎమోషన్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అప్పటి వరకూ ఇండస్ట్రీ హిట్ గా మహేష్ బాబు పోకిరి రికార్డ్స్ ని బ్రేక్ చేసి మ్యాసివ్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.

Irra Mor: అందాల దాడికి దిగిన వర్మ బ్యూటీ మోర్

మెగా ఫ్యామిలీలో మరో హీరో బన్నీ కూడా వరసగా సినిమాలు చేస్తున్న కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయిన సినిమా ఆర్య. ఆర్యతో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ సరైనోడుతో కమర్షియల్ హిట్ అందుకుని మాస్ హీరోగా టాప్ రేంజ్ కి వెళ్లిపోయాడు. ఇలా జస్ట్ హీరోలుగా ఉన్న వాళ్లు.. బిగ్ సక్సెస్ తో కెరీర్ టర్నింగ్ మూవీస్ తో నెక్ట్స్ లెవల్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు