Ashish Vidyarthi : రెండో భార్య‌తో హ‌నీమూన్‌లో ఆశిష్ విద్యార్థి..! ముస‌లోడే కానీ..

ప్ర‌ముఖ న‌టుడు ఆశిష్ విద్యార్థి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. మ‌హేశ్ బాబు హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పోకిరి చిత్రంలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Ashish Vidyarthi-Rupali Barua

Ashish Vidyarthi-Rupali Barua : ప్ర‌ముఖ న‌టుడు ఆశిష్ విద్యార్థి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. మ‌హేశ్ బాబు హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పోకిరి చిత్రంలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విల‌న్‌గా, స‌హాయ న‌టుడిగా ప‌లు చిత్రాల్లో న‌టించాడు. ఇటీవ‌ల‌ ఆయ‌న రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ఏడాది మే నెల‌లో 57 ఏళ్ల ఆశిష్ విద్యార్థి 33 ఏళ్ల అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలీ బరువా(Rupali Barua)ను రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్నారు. కోల్‌క‌తాలో జ‌రిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు అయ్యారు. గ‌తంలో ఆశిష్‌..న‌టి శకుంత‌ల బరువా కూతురు రాజోషి బరువాను పెళ్లి చేసుకోగా వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు. అయితే.. విబేధాల కార‌ణంగా వీరు విడిపోయారు.

Samyuktha Hegde : నీ శ‌రీర‌మే నీ ఆస్తి అంటూ టాప్ లెస్ వీడియో పోస్ట్‌.. చూస్తే మైండ్ బ్లాక్‌..!

ఆశిష్ రెండో పెళ్లిపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటిపై ఆయ‌న స్పందించాడు. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు అన్ని విన్నాన‌ని, పెళ్లి చేసుకోవ‌డం అంటే కేవ‌లం శారీర‌క సుఖం కోసం మాత్ర‌మే కాద‌ని, ఒక తోడు కోసం చేసుకుంటార‌ని, తాను అలాంటి తోడు కోస‌మే చేసుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా ఆశిష్‌, రూపాలీ బరువా లు హ‌నీమూన్‌కి వెళ్లారు. ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను రూపాలి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టూ ప‌చ్చ‌ద‌నం, ఆహ్లాద‌క‌ర‌మైన కొండ‌ల మ‌ధ్య దిగిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. గ‌త నెల‌లో వీరు సింగ‌పూర్‌లో విహార‌యాత్ర‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ముస‌లోడే కానీ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Actress Shruti Das : డైరెక్ట‌ర్‌ను పెళ్లిచేసుకున్న త్రిన‌య‌ని సీరియ‌ల్ న‌టి

1962 జూన్ 19న‌ ఢిల్లీలో ఆశిష్ విద్యార్థి జన్మించారు. ఈయ‌న తండ్రి మ‌ల‌యాళీ కాగా త‌ల్లి బెంగాలి. ఆశిష్ 1986 నుంచి సినిమాల్లో త‌న కెరీర్‌ను ప్రారంభించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ, బెంగాలీ ఇలా దాదాపు 11 భాష‌ల్లో దాదాపు 300 చిత్రాల్లో న‌టించారు.

Vijayendra Prasad : హాలీవుడ్ రేంజ్‌లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌.. రాజ‌మౌళి చేయ‌డం క‌ష్ట‌మే.. జ‌క్క‌న్న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభార‌తం ఎప్పుడంటే..?

ట్రెండింగ్ వార్తలు