Care Of Poultry : వర్షాకాలంలో కోళ్లపై రోగాల దాడి.. యాజమాన్యంలో జాగ్రత్తలు

కోళ్ల దాణా, అందుకు అవసరమైన ముడిసరుకులు వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి. అంతేకాదు దాణా చెడిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. మరోవైపు షెడ్ కు వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి.   ఇటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సకాలంలో టీకాలు వేయించాలి .

Care Of Poultry During Monsoon

Care Of Poultry : వర్షాకాలం ప్రారంభమైంది. అడపా దడప వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే అధిక వర్షాలు పడితే కోళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది.  దీంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో  కోళ్ల పెంపకం చేపట్టే రైతులు, వాణిజ్య సరళిలో చేపట్టే వారు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఉత్పాదకతను ఘనీయంగా పెంచ వచ్చంటున్నారు  . వి. నరసిహారావు వెటర్నరీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. హనుమంత రావు.

READ ALSO : Turmeric Crop Cultivation : పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు.. రకాల ఎంపిక, సాగు మెళకువలు

అధిక వర్షాల వల్ల  కోళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి సన్నగిల్లుతుంది. కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అవి రోగాల బారిన పడి మరణిస్తాయి. ఈ నేపథ్యంలో కోళ్ల ఫారాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కోళ్ల ఫారాలలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే, గుడ్ల ఉత్పత్తి పెరుగుతుంది.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

బ్రాయిలర్‌ కోళ్ల మాంసం దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రూడింగ్ దశనుండే ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. వర్షం వచ్చే సూచనలను గ్రహించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు పి. వి. నరసిహారావు వెటర్నరీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. హనుమంత రావు.

READ ALSO : Jagtial Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన జగిత్యాల వరి రకాలు

కోళ్ల దాణా, అందుకు అవసరమైన ముడిసరుకులు వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి. అంతేకాదు దాణా చెడిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. మరోవైపు షెడ్ కు వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి.   ఇటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సకాలంలో టీకాలు వేయించాలి .

READ ALSO : Poultry Farming : నాటు కోళ్ళ పెంపకంలో రాణిస్తున్న యువకుడు.. నెలకు రూ. 15 లక్షల టర్నోవర్

వర్షాకాలం లిట్టర్‌లో తేమ శాతం పెరగడం వల్ల కాక్సిడియాసిస్‌, ఈ-కోలై, న్యూమోనియా, సాల్మొనెల్లోసిస్‌ తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. తేమ శాతం పెరగకుండా ఫారాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి.

ట్రెండింగ్ వార్తలు