Balakrishna: బాలయ్య బాబు మాంచి స్పీడ్ మీదున్నారు. టీజర్లతోనే ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసిన బాలకృష్ణ.. ఇప్పడు సినిమా క్లైమాక్స్‌ని అదిరిపోయే రేంజ్లో చేస్తున్నారు. పంచె కట్టుకుని ప్లజెంట్‌గా కనిపించిన బాలయ్య తో పాటు అఘోరాగా అదరగొట్టారు. మరి ఈ రెండు వేరియేషన్స్తోనే హైప్ తెచ్చిన బాలయ్య క్లైమాక్స్‌ని ఏ రేంజ్లో చేస్తున్నారో తెలుసా..?
సీనియర్ హీరో బాలకృష్ణ మరోసారి తన యాక్షన్ పంజా విసరబోతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి క్లైమాక్స్ షూట్లో బిజీగా ఉన్నారు బాలయ్య. సీనియర్ హీరో అయినా.. ఇంకా సోలోగా సినిమాలు చేస్తూ.. అంతకుమించి హీరో ఎలివేషన్‌తో కంటిన్యూ అవుతున్న బాలయ్య సినిమా ‘అఖండ’ మీదే ఇప్పుడు అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
Balakrishna : 110వ సినిమా వరకు బాలయ్య లైనప్ అదిరిందిగా..!
బాలయ్య-బోయపాటి సినిమా అంటేనే ఫస్ట్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా మీద కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఈ సినిమాలో క్లాసీ లుక్‌లో పంచె కట్టుకుని కనిపించిన బాలయ్య.. ఇప్పుడు శివ భక్తుడిగా, అఘోరాగా ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమా కు సంబంధించి సూపర్ ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుకుంటూ అప్పుడే క్లైమాక్స్‌కి వచ్చేశారు టీమ్. తమిళనాడులోని కుంభకోణంలో ‘అఖండ’ సినిమా భారీ క్లైమాక్స్ షూట్ జరుగుతోంది.
Green India Challenge : మొక్కలు నాటిన బిగ్ బి అమితాబ్..
బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో వేరియేషన్స్ కోసం వర్కౌట్ చేసి వెయిట్ కూడా తగ్గిపోయారు. రిలీజ్ చేసిన టీజర్లు కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్‌గా పెంచేస్తున్నాయి. బాలకృష్ణ సినిమాలంటే సహజంగానే డైలాగ్స్.. యాక్షన్ సీక్వెన్స్‌లను ఊహించుకుంటారు ఆయన ఫ్యాన్స్. అలాంటిది ఈ సినిమాలో అంతకుమించిన యాక్షన్‌ని చూపించబోతున్నారు బోయపాటి. టీజర్లతోనే సినిమా మీద హైప్స్ పెంచేసిన బాలయ్య బొమ్మ థియేటర్లో ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.