Cooler Facts: వేసవి తాపం చల్లార్చే కూలర్లలో ఇవి తప్పక ఉండాల్సిందే

మండుటెండల నుంచి ఉపశమనం కోసం పలు సాధనాలను ఉపయోగిస్తాం. రిఫ్రిజరేటర్ లలో చల్లగా దాచుకున్న ఫుడ్ తింటూ కూలర్/ఏసీ వేసుకుని చిల్ అవుతాం.

Cooler Facts: మండుటెండల నుంచి ఉపశమనం కోసం పలు సాధనాలను ఉపయోగిస్తాం. రిఫ్రిజరేటర్ లలో చల్లగా దాచుకున్న ఫుడ్ తింటూ కూలర్/ఏసీ వేసుకుని చిల్ అవుతాం. కానీ, కూలర్ కొనుగోలు చేసే ముందు వాటిల్లో తప్పక ఉండాల్సిన ఫీచర్లేమిటో మీకు తెలుసా. మొత్తంగా కూలర్లలో ఏమేం సౌకర్యాలుంటాయో తెలుసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే..

వాటర్‌ ట్యాంక్‌ కెపాసిటి
కూలర్‌ తీసుకునేముందు తప్పకుండా ఈ విషయం గురించి ఆలోచించండి. గది వైశాల్యాన్ని బట్టి కూలర్ సైజును ఎంచుకోవాలి. చిన్న గదైతే 15-25లీటర్లు, కాస్త పెద్ద గదైతే 25-40లీటర్లు, ఇంకా పెద్దగా ఉంటే 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్‌ ట్యాంక్‌ కెపాసిటీ కూలర్‌ తీసుకోవడం బెటర్.

సౌండ్‌
కూలర్ కొనుగోలు చేసేముందు నాయిస్ లెవెల్ పరిగణనలోకి తీసుకోవాలి. కూలర్ ఆన్ చేయగానే ఎంత సౌండ్ వస్తుందని చెక్ చేసుకోవాలి. షోరూమ్‌లో ఓసారి డెమో చూశాకే కొనడం మంచిది.

ఆటో ఫిల్‌ ఆప్షన్‌
కూలర్లలో ఆటో ఫిల్ ఆప్షన్‌తో ట్యాంక్‌లో నీళ్లు ఖాళీ అవగానే ఆటోమెటిక్‌గా ఫిల్ అవుతుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల కూలర్‌ మోటార్‌ ఎక్కువకాలం మన్నుతుంది.

కూలింగ్‌ ప్యాడ్స్
ఎయిర్ కూలర్‌కు కూడా కూలింగ్ ప్యాడ్స్ ముఖ్యమే. వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్స్, హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ అని పలు రకాల్లో అందుబాటులో ఉంటాయి. హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూలింగ్‌ ఇస్తాయి. వీటి మెయింటనెన్స్ కూడా తక్కువే.0

ఐస్‌ ఛాంబర్‌
కొన్ని కూలర్లలో ఫాస్ట్ కూలింగ్ కోసం ఐస్ ఛాంబర్స్ ఉంటాయి. అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేస్తే ట్యాంక్ సాధారణమైన వాటికంటే త్వరగా కూల్ అవుతుంది.

పవర్‌ యూసేజ్‌
కూలర్‌ వేసినప్పుడు ఎన్ని పవర్‌ యూనిట్లు ఖర్చు అవుతున్నాయనే అవగాహన ముఖ్యం. స్టార్‌ రేటింగ్స్‌ ని చూసి సెలక్ట్ చేసుకోండి. అలాగే ఈ మధ్యన ఇన్వర్టర్‌ టెక్నాలజీతో కూలర్లు వస్తున్నాయి. వీటి వల్ల పవర్‌ సేవ్‌ అవుతుంది. కరెంట్ పోయిన వెంటనే కూలర్ ఆగిపోకుండా కాసేపటి వరకూ పనిచేస్తుంది.

వాతావరణం
పొడి వాతావరణంలో అయితే డిసర్ట్‌ కూలర్స్‌ బాగా పనిచేస్తాయి. తేమ వాతావరణంలో అంటే తీర ప్రాంతాల్లో నివసించే వాళ్లు పర్సనల్‌, టవర్‌ కూలర్లు తీసుకోవడం బెటర్‌.

పర్సనల్‌ కూలర్స్‌ vs డిసర్ట్‌ కూలర్స్‌
కూలర్లలో ఈ రెండు (పర్సనల్‌ కూలర్స్‌, డిసర్ట్‌ కూలర్స్‌) రకాలుంటాయి. రూమ్‌ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 200-300sftలో మీరుండే గది ఉంటే పర్సనల్‌ కూలర్‌ సరిపోతుంది. అంతకుమించి రూమ్‌ సైజు ఉంటే డిసర్ట్‌ కూలర్‌ తీసుకోవడమే కరెక్ట్.

ఇతర ఫీచర్లు
అందుబాటులో ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా కూలర్లలో ఇప్పుడు చాలా ఫీచర్లు వస్తున్నాయి. రిమోట్‌ కంట్రోల్‌, యాంటీ మస్కిటో ఫిల్టర్‌, డస్ట్‌ ఫిల్టర్‌ లాంటి అదనపు ఫీచర్లను అందిస్తున్నారు. ఒకసారి వాటిని కూడా ఎంక్వైరీ చేసుకొని మంచి కూలర్‌ ని ఎంచుకోండి.

ట్రెండింగ్ వార్తలు