Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్.. స్మార్ట్ సిగ్నల్స్ వచ్చేస్తున్నాయ్..

బెంగళూరు నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్ కష్టాల నుంచి బెంగళూరు వాసులు త్వరలోనే బయట పడనున్నారు.

Bengaluru Smart Signals

Bengaluru Smart Signals: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా చూసేందుకు డైరక్టరేట్ ఆఫ్ అర్బన్ లాండ్ ట్రాన్స్ పోర్ట్(డీయూఎల్టీ) నడుంబిగించింది. ఇందులో భాగంగా స్మార్ట్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 28 జంక్షన్లలో స్మార్ట్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ (Bengaluru Traffic) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసు వేళల్లో నగర రహదారులపై విపరీతమై రద్దీ కనిపిస్తుంటుంది. ట్రాఫిక్ జామ్ లతో బెంగళూరు వాసులు ఎదుర్కొనే కష్టాలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ (Traffic Signals) దగ్గర పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. సిగ్నల్ పనిచేయక పోయినా, సరైన సమన్వయం లేకపోయినా వాహనదారులకు నరకం కనబడుతుంది. ట్రాఫిక్ కష్టాల నుంచి వాహనదారులకు గట్టెక్కించడానికి స్మార్ట్ సిగ్నల్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

స్మార్ట్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయి?
మన దేశంలో మొదటిసారిగా ఈ టెక్నాలజీని అందుబాటు తీసుకొస్తున్నామని డీయూఎల్టీ ప్రతినిధులు చెబుతున్నారు. అడ్వాన్సడ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టం(ఏటీఐఎంఎస్) ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. జంక్షన్లలో వాహనాల రద్దీకి అనుగుణంగా ఈ సిగ్నల్స్ పనిచేస్తాయి. వాహనాలు ఎక్కువగా ఉన్నవైపునకు అదనపు సమయాన్ని ఇస్తాయి. తక్కువగా ఉన్న వైపు స్వల్ప సమయాన్ని కేటాయిస్తాయి. దీంతో సిగ్సల్స్ దగ్గర వేచివుంచే సమయం చాలా వరకు తగ్గుతుంది. ఫలితంగా రహదారులపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో పిల్లికి ఉద్యోగం .. క్యాప్,యూనిఫాం ధరించి ఏం చేస్తుందో తెలుసా..?!

ఎంపిక చేసిన కూడళ్లలో క్యూ లెన్త్ మెజర్ మెంట్(క్యుఎంఎస్) డివైజ్ ఏర్పాటు చేస్తారు. ఇవి అందించే డేటా ఆధారంగా సిగ్నల్స్ పనిచేసేలా చూస్తారు. అంతేకాదు వీడియో డిటెక్షన్ సిస్టంతో సిగ్నల్స్ వద్ద వాహనాల రద్దీని చిత్రీకరిస్తారు. ఈ వీడియోల ఆధారంగా ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సెంటర్(టీఎంఎస్) నుంచి సిగ్సల్స్ ను ట్రాఫిక్ పోలీసులు మేనేజ్ చేస్తారు. అత్యవసర పరిస్థితులు, ప్రముఖులు రాకపోకల సమయంలో ఈ విధానం బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. స్మార్ట్ సిగ్నల్స్ ద్వారా కనీసం 30 శాతం ట్రాఫిక్ తగ్గుతుందని డీయూఎల్టీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

కరోనాతో ఆలస్యం
స్మార్ట్ సిగ్నల్స్ ఏర్పాటుకు 2021, జూన్ 30న జపాన్ ప్రభుత్వంతో కర్ణాటక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు అమలు వాయిదా పడింది. గతేడాది అక్టోబర్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి 28 జంక్షన్లలోనే స్మార్ట్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని, వీటి పనితీరును అంచనా వేసిన తర్వాతే విస్తరిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. స్మార్ట్ సిగ్నల్స్ ఏర్పాటును బెంగళూరు వాసులు స్వాగతిస్తున్నారు.

స్మార్ట్ సిగ్నల్స్ ఎక్కడెక్కడంటే..?
క్వీన్స్ రోడ్ – కస్తుర్బా రోడ్ – ఎంజీ రోడ్ జంక్షన్
ఎంజీ రోడ్ – సెయింట్ మార్స్క్ రోడ్
ఎంజీ రోడ్ – రెసిడెన్సీ రోడ్ జంక్షన్
ఎంజీ రోడ్ – ట్రినిటీ చర్చి రోడ్ జంక్షన్
కబ్బన్ రోడ్ – డిక్సన్ సన్ రోడ్ జంక్షన్
కబ్బన్ రోడ్ – కామరాజ్ రోడ్ జంక్షన్
రెసిడెన్సీ రోడ్ – బ్రిగేడ్ రోడ్ జంక్షన్
జనరల్ తిమ్మయ్య రోడ్ – హోసూరు రోడ్ జంక్షన్
స్వామి వివేకానంద రోడ్ – ఇందిరానగర్ 100 ఫీట్ రోడ్ జంక్షన్
జనరల్ తిమ్మయ్య రోడ్ – మాగ్రాత్ రోడ్

Also Read: సెల్ ఫోన్లో గేమ్‌లు కాదు.. ఈ స్ట్రీట్ గేమ్ ఆడండి.. హర్ష్ గొయెంకా షేర్ చేసిన వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు