Mega Heroes : ఆగష్టులో మెగా హీరోల సినిమా కార్నివాల్.. పవన్ అండ్ సాయి ధరమ్..

ఆగష్టులో చిరంజీవి, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్ తేజ్ వారం గ్యాప్ లో సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్..

Bholaa Shankar Aadi Keshava Gandeevadhari Arjuna Bro releases

Mega Heroes : ఈ ఏడాది ఆగష్టులో మెగా హీరోల సినిమా కార్నివాల్ జరగబోతుంది. చిరంజీవి, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్ తేజ్ వారం గ్యాప్ లో సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ముందుగా చిరు భోళా శంకర్ (Bholaa Shankar) సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్ వస్తుంది. గ్యాంగ్ స్టార్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ విడుదలైన 7 రోజులకే వైష్ణవ తేజ్ రాబోతున్నాడు.

Rajamouli : స్విస్ ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలి క్రేజ్.. రాజమౌళిని ట్యాగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుడు చేసిన పోస్ట్ వైరల్!

ఆగస్టు 18న ‘ఆదికేశవ’ (Aadi Keshava) సినిమాతో వైష్ణవ థియేటర్ లో సందడి చేయనున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ నే అందుకుంది. వైష్ణవ మునపటి రెండు సినిమాలు థియేటర్ వద్ద పెద్దగా సత్తా చూపలేకపోయాయి. దీంతో ఈ మూవీతో ఎలాగైనా విజయం అందుకోవాలని చూస్తున్నాడు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ (Joju George) విలన్ కనిపించబోతున్నాడు.

Yatra 2 : యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్.. రిలీజ్ డేట్ కూడా ఖరారు..

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఆగష్టులోనే రాబోతున్నాడు. గూఢచారి బ్యాక్ డ్రాప్ తో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 25న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆగష్టు కంటే ఒక వారం ముందు జులై చివరి వారంలో పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ నటించిన BRO కూడా రిలీజ్ కాబోతుంది. ఆగష్టులో ఆ సినిమా సందడి కూడా కనిపించనుంది. దీంతో ఆగష్టు మొత్తం మెగా ఫెస్టివల్ జరగబోతుంది.

 

ట్రెండింగ్ వార్తలు