Madhavi Latha : బిగ్‌బాస్ సీజ‌న్ 7 ఆఫ‌ర్ నిజ‌మే.. టాలీవుడ్ హీరోయిన్ మాధ‌వీల‌త‌.. ఇప్ప‌టికీ మూడు సార్లు..

న‌చ్చావులే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది మాధ‌వీల‌త‌(Madhavi Latha). మాధ‌వీల‌త‌ను బిగ్‌బాస్ బృందం సంప్ర‌దించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలియ‌జేసింది.

Madhavi Latha

Bigg Boss Team consult Madhavi Latha : ‘న‌చ్చావులే’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది మాధ‌వీల‌త‌(Madhavi Latha). ఆ త‌రువాత ‘స్నేహితుడు’, ‘అర‌వింద్ 2’ వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది. అయితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటోంది. వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తుంటుంది.

బిగ్ బాస్ రియాలిటీ షో కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఏడో సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో కంటెస్టెంట్ల‌ను ఎంపిక ప‌నిలో ఉంది బిగ్‌బాస్ బృందం. ఈ నేప‌థ్యంలో మాధ‌వీల‌త‌ను సంప్ర‌దించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. వాళ్లు మూడు సార్లు అఫీషియ‌ల్‌గా క‌లిసిన‌ట్లు చెప్పుకొచ్చింది.

Ira Khan : అమ్మా నాన్న‌ల విడాకులు.. రోజులో 8 గంట‌లు ఏడుపు..10 గంట‌లు నిద్ర‌.. మందులు మానేశా.. ఏడాదిన్నరపాటు డిప్రెషన్‌

మాధ‌వీల‌త‌ను బిగ్‌బాస్ టీమ్ సంప్ర‌దించారు అని ఓ నెటీజెన్ క్రియేట్ చేసిన ఫోటోను షేర్ చేసిన ఆమె ఇలా రాసుకొచ్చింది. “నా ఫాలోవ‌ర్స్ అంద‌రికి ఓ విష‌యం తెలియ‌జేయాల‌నుకుంటున్నాను. ఎవ‌రు దీన్ని (ఫోటో)ను క్రియేట్ చేశారో తెలియ‌దు. అయితే అది నిజ‌మే. బిగ్‌బాస్ సీజ‌న్ 7 కోసం టీమ్ న‌న్ను సంప్ర‌దించింది. అయితే ఇదే మొద‌టి సారు కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు వాళ్లు నాకు బిగ్‌బాస్ ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే.. ఆ ఆఫ‌ర్స్‌ను నేను సున్నితంగా తిర‌స్క‌రించాను. ఇక నాకు వ్య‌క్తిగ‌తంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాల‌ని లేదు. న‌న్ను షో లో పాల్గొనాల‌ని కోరినందుకు బిగ్‌బాస్ టీమ్‌కు చాలా థ్యాంక్స్.” అని మాధ‌వీ ల‌త అంది.

Mukku Avinash : శుభ‌వార్త చెప్పిన అవినాష్‌.. ఇద్ద‌రు ముగ్గురు అయ్యే వేళ‌.. బేబీ గుండె చ‌ప్పుడు విన్న‌ప్పుడు..

బిగ్‌బాస్ సీజ‌న్ 7లో పాల్గొంటే వారానికి రూ.5ల‌క్ష‌ల నుంచి రూ.6ల‌క్ష‌ల ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. రెమ్యున‌రేష‌న్‌పై మాధ‌వీల‌త స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం ఆమె చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. కొద్ది మంది మాత్రం ఆమెను బిగ్‌బాస్ సీజ‌న్ 7లో పాల్గొనాల‌ని కోర‌గా మ‌రికొంద‌రు మాత్రం మీరు తీసుకున్న నిర్ణ‌యం బాగుంద‌ని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు