24గంటల్లో న్యాయం అన్నారు… ఏమైంది లోకేశ్ ? : విజయసాయి రెడ్డి

కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారు.. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ..

Nara Lokesh and Vijaya Sai Reddy

Vijaysai Reddy : కూటమి ప్రభుత్వం అధికారంలోకివస్తే 24గంటల్లో న్యాయం జరుగుతుందని ప్రజలను నమ్మించారు.. ఇప్పుడేమైంది అంటూ మంత్రి నారా లోకేశ్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విటర్) వేదికగా వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారు.. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన అంటూ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా నిలదీశారు.

Also Read : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఇటీవల శాంతి ఇష్యూపై తనమీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు విజయసాయి రెడ్డి స్ట్రాంగ్  కౌంటర్ ఇచ్చారు.

లోకేశ్ ను ట్యాగ్ చేస్తూ.. నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్ధంకాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేనే నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా అంటూ.. విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Also Read : లైంగిక దాడి చేసి చంపేశారు- ముచ్చుమర్రి ఘటనపై సంచలన విషయాలు చెప్పిన నంద్యాల ఎస్పీ

 

 

ట్రెండింగ్ వార్తలు