బుమ్రాను దించేశాడు..! బుమ్రా స్టైల్‌లో బౌలింగ్ చేస్తున్న బుడ్డోడిని చూశారా.. వీడియో వైరల్

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ బుడ్డోడు అచ్చం బుమ్రా తరహాలో బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ యాక్షన్ తోపాటు, యార్కర్లు వేయడంలోనూ ..

Young Boy bowling action like Jasprit Bumrah

Junior Bumrah : ప్రపంచంలో అత్యంత ప్రమాదకర బౌలర్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా కూడా ఒకరు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే బ్యాటర్లకు చెమటలు పట్టాల్సిందే. యార్కర్లతో పాటు, వేగంగా బంతులను సంధిస్తూ బ్యాటర్లను బెంబేలెత్తిస్తుంటారు. బుమ్రా బౌలింగ్ చేసే విధానంసైతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుత యువ పేసర్లు బుమ్రా బౌలింగ్ వేయాలని కఠోర సాధన చేస్తుంారు. అయినా.. బుమ్రా స్టైల్ ను మాత్రం ఎవరూ అనుసరించలేక పోతున్నారు. అయితే, ఓ పాకిస్థాన్ బుడ్డోడు బౌలింగ్ లో అచ్చం బుమ్రాను దించేదశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Sourav Ganguly : గంగూలీకి షాకిచ్చిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. ఆశ‌లు ఆవిరి..!

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ బుడ్డోడు అచ్చం బుమ్రా తరహాలో బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ యాక్షన్ తోపాటు, యార్కర్లు వేయడంలోనూ బుడ్డోడు బుమ్రాను దింపేశాడు. ఈ వీడియో పాకిస్థాన్ లో ఎక్కడిదో స్పష్టంగా తెలియనప్పటికీ.. 33 సెకన్ల వీడియో మాత్రం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జూనియర్ బుమ్రా అంటూ పేర్కొంటున్నారు. మరికొందరు అచ్చం బుమ్రాను దించేశాడంటూ బుడ్డోడి బౌలింగ్ స్కిల్స్ ను కొనియాడుతున్నారు. 33 సెకన్ల వీడియోలో బుడ్డోడు నాలుగు బంతులు వేయగా అందులో ఒక్క బంతిని కూడా బ్యాటర్ కనీసం బ్యాటుకు తగిలించలేక పోయాడు.

Also Read : Virat Kohli – Chiranjeevi : కోహ్లీ చిరంజీవి అభిమానా? చిరు పాటలంటే పిచ్చి.. ఆసక్తికర విషయం చెప్పిన కోహ్లీ ఫ్రెండ్..

ఈ వీడియోపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమం స్పందించాడు. వావ్.. బంతిపై అతడి నియంత్రణను చూడండి.. చూడటానికి అచ్చం ది గ్రేట్ జస్ర్పీత్ బుమ్రా లాగే ఉంది అంటూ కొనియాడారు. నా దృష్టిలో ఈరోజుకు ఇదే బెస్ట్ వీడియో అంటూ ట్విటర్ లో వసీం అక్రమ్ రిప్లేయ్ ఇచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు