RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రొమాన్స్ లేదు.. ఓన్లీ బ్రోమాన్స్ మాత్రమే : రాజమౌళి

రాజమౌళి మాట్లాడుతూ... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రొమాన్స్‌ లేదు, రొమాన్స్ కన్నా బ్రోమాన్స్‌ ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంతో అక్కడి వారంతా ఇదేంటి కొత్తగా.........

RRR :  స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కింది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే మరో పాన్ ఇండియా సినిమా ఇది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమా ప్రమోషన్స్ ని రాజమౌళి దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అన్ని భాషల్లోనూ వరుస ప్రెస్ మీట్స్ పెట్టి సినిమాని భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇటీవల పెట్టిన ప్రెస్ మీట్ లో సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలని తెలియచేసారు.

pushpa : ‘పుష్ప’ హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతనే

రాజమౌళి మాట్లాడుతూ… ఈ సినిమాలో రామ్, భీమ్‌ అనే రెండు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు నా కథ వర్కౌట్‌ అవ్వాలంటే హీరోలిద్దరి క్యారెక్టర్స్‌ కి ప్రేక్షకులు ఒకేలా రియాక్ట్ అవ్వాలి. ఈ ఇద్దరూ నవ్వితే ప్రేక్షకులు నవ్వాలి. ఏడిస్తే ఏడవాలి. అంతేకానీ తారక్‌కు ఎక్కువ ఫైట్స్‌ ఉన్నాయా? ఎన్టీఆర్‌కు ఎక్కువ ఫైట్స్‌ ఉన్నాయా? అనే చర్చ రాకూడదు. కానీ వీటి గురించి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్స్‌లో సినిమా చూసినప్పుడు మాత్రం ఇద్దరి స్టార్ల గురించి మర్చిపోయి కథని, వారిద్దరి మధ్య స్నేహాన్ని చూస్తారని అనుకుంటున్నాను అని అన్నారు.

Manchu Lakshmi : కేరళ ప్రాచీన విద్యతో అదరగొడుతున్న మంచు లక్ష్మి… వైరల్ అవుతున్న వీడియోలు

అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రొమాన్స్‌ లేదు, రొమాన్స్ కన్నా బ్రోమాన్స్‌ ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంతో అక్కడి వారంతా ఇదేంటి కొత్తగా అని చూశారు. ఇటీవల ఫ్రెండ్స్ ని, తెలిసిన వాళ్ళని అందరూ బ్రో అని పిలుస్తున్నారు. ఇద్దరి స్నేహితుల మధ్య ఉన్న అనుబంధాన్ని బ్రోమాన్స్ అంటాను అని చెప్పారు. ఈ సినిమాలో వీరి మధ్య స్నేహం అంత బాగుంటుంది. వీరి మధ్య బంధాన్ని బ్రోమాన్స్‌ అంటున్నాను, ఇది సినిమాలో ఎక్కువగానే కనిపిస్తుంది అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు