Union Budget 2022 : చేనేత చీరలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

Union Budget 2022 : 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. నాల్గోసారి కేంద్ర బడ్జెట్‌ను మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. అంతకుముందు కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై పద్దులను ఆమోదించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ చాలా సింపుల్‌గా కనిపించారు. చేనేత రంగు చీరను ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వచ్చారు. నిర్మలమ్మకు చేనేత చీరలంటే చాలా ఇష్టం.

ఆమె ఎప్పుడూ బోల్డ్ కలర్స్, క్లిష్టమైన థ్రెడ్‌వర్క్ నేత చీరల్లో కనిపిస్తుంటారు. 2022 ఏడదిలో కూడా కేంద్ర బడ్జెట్ 2022 సందర్భంగా ఆర్థిక మంత్రి మళ్లీ చేనేత నేత చీరలోనే కనిపించారు. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా నిర్మలమ్మ ముదురు ఎరుపు రంగు పోచంపల్లి చీరలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఈ ఏడాది మాతర్ం మంత్రి నిర్మలమ్మ ఎరుపు రంగు చీరలో కనిపించారు. చీరకట్టుతోనే నిర్మల లింగ పక్షపాతాన్ని తొలగించానలే బలమైన వాదనను వినిపించారు. 2021 ఏడాది మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా నిర్మలమ్మ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆ ప్రసంగంలో ఎవరైనా చీర ధరించాలని అన్నారు. మరొకరు పెయింట్ సూట్లు ధరించాలని అన్నారు.

నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ రూపొందించినట్టు నిర్మల చెప్పారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత ఉపాధి, ఉద్యోగ కల్పన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నామన్నారు. పరిశ్రమలకు ఆర్థిక ఊతం కల్పించే దిశగా.. పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేస్తుందన్నారు.

Read Also : Budget 2022 : ఈ బడ్జెట్‌ రానున్న 25 ఏళ్ల అమృతకాలానికి పునాది : మంత్రి నిర్మలా సీతారామన్

ట్రెండింగ్ వార్తలు