Cashew Manufacturing : కుటీర పరిశ్రమగా జీడిపప్పు తయారీ.. సంప్రదాయ పద్దతిలోనే పప్పు తయారీ చేస్తున్న వ్యాపారులు

జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలోకేల్ల భారత దేశం అగ్రగామిగా ఉండగా, భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లానుండి, ప్రకాశం, నెల్లూరు జిల్లా వరకు కోస్తాతీరం వెంట జీడిపంట సాగవుతుంది. అయితే రాష్ట్రంలో అధికంగా శ్రీకాకుళం జిల్లా , పలాసలో అధికంగా జీడిపప్పు ఉత్పత్తి అవుతుండగా, తరువాతి స్థానం బాపట్ల జిల్లా వేటపాలెంది.

Cashew Nuts Processing Employmen

Cashew Manufacturing : వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా రైతులు పంట ఉత్పత్తులను తయారు చేస్తేనే… మార్కెట్ లో గిట్టుబాటు ధర లభిస్తుంది. ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా పంటను అమ్మితే వ్యాపారుల దోపిడికి గురికాక తప్పదు. అందుకే తీర ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న జీడిమామిడి పంటను తూర్పుగోదావరి జిల్లా, మోరి ప్రాంతానికి చెందిన కొందరు రైతులు కొనుగోలు చేసి.. తమకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో.. మినీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొని జీడిపప్పు తయారు చేస్తూ.. ఉపాధి పొందుతున్నారు.

READ ALSO : Arable Land : సాగుకు యోగ్యంగా చౌడుభూముల పునరుద్ధరణ.. సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే సత్ఫలితాలు

తెల్లబంగారంగా చెప్పుకునే జీడిపప్పును ఇష్టపడని వారు ఎవరంటారు.. కనిపిస్తే లొట్టలేసుకని తినాలి అనిపిస్తుంది. ఆరోగ్య పరంగా లాభాలు ఉంటాయి కాబట్టి జీడి పప్పుకు పుల్ డిమాండ్.. నేరుగా తినకపోయినా.. ఉప్మా, సేమియా, పరవన్నం, బిర్యానీ ఇలా వివిధ వంటల్లో జీడి పప్పు ఉంటే ఆ టేస్టే వేరు. అందుకే ఎంత ధర అయినా కొని తీరాలి అనుకుంటారు. అందుకే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే పంటల్లో ఒకటిగా జీడిపంట మారింది.

READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !

జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలోకేల్ల భారత దేశం అగ్రగామిగా ఉండగా, భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లానుండి, ప్రకాశం, నెల్లూరు జిల్లా వరకు కోస్తాతీరం వెంట జీడిపంట సాగవుతుంది. అయితే రాష్ట్రంలో అధికంగా శ్రీకాకుళం జిల్లా , పలాసలో అధికంగా జీడిపప్పు ఉత్పత్తి అవుతుండగా, తరువాతి స్థానం బాపట్ల జిల్లా వేటపాలెంది. ఆతరువాతి స్థానం మాత్రం ఉభయగోదావరి జిల్లాలది.

READ ALSO : Fish Production : అపోలోఫిష్ , రూప్ చంద్ చేపపిల్లల ఉత్పత్తి

అయితే రుచిలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా, సకినేటి పల్లి  మండలం, మోరి గ్రామం జీడిపప్పు తరువాతే మరేదైనా.. అంటారు ఇక్కడి వ్యాపారులు. తోపుచర్ల, జంగారెడ్డి గూడెం ప్రాంతాల్లోని  రైతుల నుండి నేరుగా జీడిగింజలను కొనుగోలు చేసి కుటీర పరిశ్రమగా జీడిపప్పును తయారు చేస్తున్నారు. మోరిగ్రామంలో ఎటుచూసినా జీడిగింజలు ఒలుస్తూ పరిశ్రమలు కనబడుతాయి.  గుండు, బద్ద, ముక్క తయారు చేసి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.

READ ALSO : Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు

అయితే ప్రభుత్వం, బ్యాంకుల సహకారం లేకపోవడంతో పాత పద్ధతుల్లోనే ఇంకా జీడిపప్పును తయారు చేస్తున్నారు . అయితే ఆధునిక  యాంత్రాలతో తయారైన పప్పుకంటే ఇది ఎంతో రుచికరంగా ఉంటుందంటుది. కానీ తక్కువ ఖర్చుతోనే యంత్రాల ద్వారా జీడిపప్పు తయారవుతుండటంతో.. వారు తక్కువ ధరకే వినియోగిస్తున్నారు. దీంతో రోస్టింగ్ పప్పుకు డిమాండ్ తగ్గుతోందని  తయారి దారులు వాపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు