I-T raids on Xiaomi, Oppo: షియోమీ, ఒప్పో కంపెనీలపై రూ.1000 కోట్ల జరిమానా విధించే అవకాశం

చైనా మొబైల్ కంపెనీలు షియోమీ, ఒప్పో భారత పన్ను చట్టాలను ఉల్లఘించాయి. దీంతో ఈ రెండు కంపెనీలపై ఆదాయపు పన్నుశాఖ రూ.1000 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది

I-T raids on Xiaomi, Oppo: భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్న చైనా మొబైల్ కంపెనీలు షియోమీ, ఒప్పో.. భారత పన్ను చట్టాలను ఉల్లఘించాయి. దీంతో ఈ రెండు కంపెనీలపై ఆదాయపు పన్నుశాఖ రూ.1000 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. షియోమీ, ఒప్పో సహా దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న మొబైల్ తయారీ సంస్థలపై గత పది రోజులుగా ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది. ఢిల్లీ సహా కర్ణాటక, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఆయా సంస్థల కార్యాలయాల్లో ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా షియోమీ, ఒప్పో సంస్థలు రాయల్టీ రూపంలో రూ.5500 కోట్లను తమతమ డీలర్ల నుండి వసూలు చేసి విదేశాలకు తరలించినట్లు ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. ఈమొత్తంలో రూ.1400 కోట్లకు ఈ సంస్థలు టాక్స్ ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు.

Also Read: China India border Issue: సరిహద్దు వెంట సాయుధ రోబోలను మోహరించిన చైనా

ఆదాయపు పన్ను నియంత్రణ చట్టం, 1961 కింద సూచించిన విధంగా ఈ కంపెనీలు తమ అనుబంధ సంస్థలతో జరిపిన లావాదేవీలను బహిర్గతం చేయలేదని.. దీంతో వారు 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం జరిమానా చర్యలకు బాధ్యత వహిస్తారు, దీని పరిమాణం ₹ 1,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. అంతేకాక, ఈ రెండు సంస్థలకు విదేశాల నుంచి నిధులు కూడా అంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఐటీ దాడుల సందర్భంగా జరిపిన విశ్లేషణలో ఈ విషయం బయటపడింది. సుమారు రూ. 5000 కోట్లకు సంబంధించి మూలాలు బయటపడలేదని తనిఖీల్లో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం ఈ రెండు సంస్థలపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.

Also Read: Potatoes in Flights: 3 విమానాల్లో అమెరికా నుంచి జపాన్‌ కు బంగాళాదుంపల లోడు

ట్రెండింగ్ వార్తలు