Acharya : ఇండియాలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ సెట్.. ధర్మస్థలిపై మెగాస్టార్ మాటల్లో..

ఆచార్య సినిమా కోసం ధర్మస్థలి అనే ఊరినే సెట్ వేసి నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో చిరంజీవి ఆచార్య ధర్మస్థలి సెట్ లో ఉండి దాని గురించి మాట్లాడుతూ................

 

Chiranjeevi :  చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా రిలీజ్ కి రెండు రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆచార్య సినిమాలో వేసిన ధర్మస్థలి సెట్ గురించి చిరంజీవి స్వయంగా వివరించారు. చిరంజీవి ఆచార్య కోసం వేసిన సెట్ ని వివరించిన వీడియోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఆచార్య సినిమా కోసం ధర్మస్థలి అనే ఊరినే సెట్ వేసి నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో చిరంజీవి ఆచార్య ధర్మస్థలి సెట్ లో ఉండి దాని గురించి మాట్లాడుతూ.. ”కోకాపేటలో ఒక టెంపుల్ టౌన్ నిర్మించాం ఆచార్య కోసం. కొరటాల నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఒక టెంపుల్ టౌన్ కావాలి, పాతకాలం నాటిది. ఒక పక్క కొండలు, మరో పక్క గ్రీనరీ, మరో పక్క పెద్ద నది, ఊరిలా ఉంటుంది అని చెప్పారు. చాలా బాగుంది కానీ ఇన్ని కాంబినేషన్స్ తో లొకేషన్ ఎక్కడ దొరుకుతుంది అని నాకు మొదటి నుంచి డౌట్ ఉంది. కొన్ని నెలలకి కోకాపేట లోనే టెంపుల్ టౌన్ నిర్మించాం.”

Chiranjeevi : మరోసారి చిరు లీక్స్.. ఎవరండీ పవన్ కళ్యాణ్.. ఏంటి వాడి ధైర్యం??

”20 ఎకరాల్లో ఒక టౌన్ ని అగ్రహారాలు, మండపాలు, గుడి, గాలి గోపురాలు, ఒక పెద్ద విగ్రహం, కొండలు, ఇవన్నీ ఉండేలాగా నిర్మించారు. టోటల్ గా సినిమా చూసేసరికి చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాం. ఇలాంటి లొకేషన్స్ లో రియల్ గా దొరకవు, ఒకవేళ దొరికినా షూటింగ్ ఇంకా అవుతూనే ఉండేది. ఈ సెట్ ఇంత బాగా రావడానికి ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ముఖ్య కారణం. అతను తమిళనాడు చిదంబరం నుంచి వచ్చాడు. చిదంబరం అంటే అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. అతను చిన్నప్పటినుంచి ఆ టెంపుల్స్ చూశాడు కాబట్టి స్థంబాలు, విగ్రహాలు, మండపాలు ఎలా ఉంటాయి, గుళ్ళు, గాలి గోపురాలు ఎలా ఉంటాయి అని అతనికి బాగా తెలుసు. అందుకే అంత బాగా డిజైన్ చేశాడు. దేశం మొత్తం మీద సినిమా కోసం వేసిన సెట్స్ లో ఇంత పెద్దగా 20 ఎకరాల్లో వేసిన ఏకైక సెట్ ఆచార్య సినిమా సెట్ మాత్రమే” అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు