Jabardasth Avinash : బిగ్‌బాస్‌కి వెళ్ళడానికి 10 లక్షలు ఫైన్ కట్టిన జబర్దస్త్ అవినాష్.. శ్రీముఖి దగ్గర అప్పు తీసుకొని..

జబర్దస్త్ నుంచి అవినాష్ బిగ్ బాస్ కి వెళ్ళాడు.

Jabardasth Avinash Comments on Jabardasth Bigg Boss Sreemukhi

Jabardasth Avinash : జబర్దస్త్ తో ఎంతోమంది కమెడియన్స్ సినీ పరిశ్రమకు పరిచయమై స్టార్స్ అయ్యారు. వారిలో అవినాష్ ఒకరు. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా చేరి ముక్కు అవినాష్ గా గుర్తింపు తెచ్చుకొని టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం అవినాష్ సినిమాల్లో కమెడియన్ గా వరుసగా ఛాన్సులు తెచ్చుకుంటున్నాడు. అయితే జబర్దస్త్ నుంచి అవినాష్ బిగ్ బాస్ కి వెళ్ళాడు.

జబర్దస్త్ లో, ఆ షో నిర్మాణ సంస్థలో చేసేవారికి అక్కడ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ తో పాటు ఇన్నాళ్లు చేయాలని బాండ్ కూడా ఉంటుంది. ఆ బాండ్ మధ్యలో బ్రేక్ చేసి వెళ్తే ఆ నిర్మాణ సంస్థకి భారీగా ఫైన్ కట్టాల్సిందే. అయితే అవినాష్ జబర్దస్త్ చేస్తున్నప్పుడే బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ బాండ్ బ్రేక్ చేసి బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇందుకు జబర్దస్త్ నిర్మాణ సంస్థకు అవినాష్ 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఆ సమయంలో అతని దగ్గర అంత డబ్బు లేకపోవడంతో యాంకర్ శ్రీముఖి దగ్గర 5 లక్షలు, మరొకరి దగ్గర 5 లక్షలు తీసుకొని ఆ ఫైన్ కట్టినట్టు తెలిపాడు.

Also Read : Matka Movie : వరుణ్ తేజ్ ‘మట్కా’ మేకింగ్ వీడియో.. వరుణ్ కోసం ఎన్ని వాచ్‌లు, కళ్లజోడులు, చైన్లు తెచ్చారో చూడండి..

అప్పుగా తీసుకున్న ఆ 10 లక్షలు కూడా బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే తిరిగిచ్చానని, బిగ్ బాస్ వల్ల నాకు ఫైనాన్షియల్ గా బాగానే డబ్బులు వచ్చాయని, ఆ తర్వాత కూడా టీవీ, సినిమాల్లో మంచి ఛాన్సులు వచ్చాయని తెలిపాడు అవినాష్. ఇక శ్రీముఖి తనకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అని, ఆ స్నేహంతోనే శ్రీముఖి తనకు అప్పు ఇచ్చిందని తెలిపాడు. దీంతో అవినాష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.