Pawan Kalyan : వారాహి దీక్షలో పవన్ కళ్యాణ్ పూజలు.. మంగళగిరి జనసేన కార్యాలయంలోనే దీక్ష..

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించారు.

Pawan Kalyan Varahi Deeksha Pooja in Mangalagiri Janasena Party Office

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 25వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజులపాటు చేస్తున్నారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. నిన్న మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష తీసుకున్నారు.

Also Read : Varahi Ammavaru : పవన్ వారాహి అమ్మవారి దీక్ష.. ఈ దీక్ష ఏంటి? ఎందుకు చేస్తారు? వారాహి అమ్మవారు ఎవరు?

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సాయంత్రం కూడా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజులపాటు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి పూజలు రెండు పూటలా చేయనున్నారు. జనసేన పార్టీ అధికారికంగా పవన్ కళ్యాణ్ దీక్ష, పూజ ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.