Bholaa Shankar : భోళా శంకర్ ట్రైలర్‌కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిరంజీవి..

చిరంజీవి నటిస్తున్న తమిళ్ రీమేక్ మూవీ భోళా శంకర్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ ట్రైలర్‌ని..

Chiranjeevi Bholaa Shankar trailer release date fix

Bholaa Shankar : వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్ స్టార్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఇక చిరుకి చెల్లిగా మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపిస్తుంటే ఆమెకు జోడిగా అక్కినేని హీరో సుశాంత్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

Ram Charan : పెళ్ళైన కొత్తలో ఉపాసన.. రామ్ చరణ్‌ చెంప పై కొట్టిందట.. ఎందుకో తెలుసా..?

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ నెల 27న ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన మేకర్స్ టైం మాత్రం చెప్పలేదు. కాగా ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యలో గోదావరి యాసతో అదరగొట్టిన చిరు.. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో అలరించబోతున్నాడు.

Ram Charan : రామ్ చరణ్‌ మొదటి రెమ్యూనరేషన్‌తో ఏమి కొన్నాడో తెలుసా..? ఎక్కువుగా కొనేదేంటో తెలుసా..?

శంకర్ దాదా MBBS రేంజ్ లో చిరు ఈ సినిమాలో కామెడీతో అలరించబోతున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో చిరు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించబోతున్నాడట. పవన్ ని ఇమిటేట్ చేస్తూ వచ్చే సన్నివేశాలు, అలాగే ఖుషీ మూవీలోని నడుము సీన్ ని స్పూఫ్ చేస్తూ వచ్చే సీన్స్ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయనున్నాయని చెబుతున్నారు. ఏ కె ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు