Gally Gang Stars Movie Released on July 26 with Orphans Gangster Story
Gally Gang Stars : సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ముఖ్య పాత్రలలో ధర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ABD ప్రొడక్షన్ బ్యానర్ పై డా.ఆరవేటి యశోవర్ధాన్ ఈ సినిమాని నిర్మించారు. గల్లీ గ్యాంగ్ స్టార్స్ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కి ఉండగా పలు కష్టాలని దాటుకొని సడెన్ గా రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ గల్లీ గ్యాంగ్ స్టార్స్ సినిమా కూడా రేపటి బరిలో నిలిచింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ ధర్మ మాట్లాడుతూ.. గల్లీ గ్యాంగ్ స్టార్స్ అనే సినిమాని చాలామంది అనాధలు రోజువారీ ఎదుర్కునే సంఘటనల ఆధారంగా తెరకెక్కించాను. అనాధల బాధ్యత సమాజం తీసుకోకపోతే సమాజంలో ఎన్ని దారుణాలు జరుగుతాయో చూపించాను. సినిమా షూటింగ్ మొత్తం నెల్లూరులోనే 76 రోజుల పాటు చేసాము. ఎన్నో సార్లు అనుకున్న బడ్జెట్ దాటిపోయి షూటింగ్ ఆగిపోతుంది అనుకున్నాము. కానీ ధైర్యంగా నిర్మాత గారు కూడా నిలబడటంతో ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ చిన్న సినిమాని థియేటర్ కి వచ్చి చూసి ఎంకరేజ్ చేయాలి అని అన్నారు.
Also Read : Average Student Nani : ‘ఏమైందో మనసే..’ రొమాంటిక్ సాంగ్ విన్నారా?
నిర్మాత యశోవర్ధన్ మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి నాకు సినిమా అంటే ఇష్టం. ABD ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తూ వరసగా మూడు సినిమాలు తెస్తున్నాను. మొదటి సినిమా ‘May 16’ అని ఒక మోనో డ్రామా ప్రయోగాత్మకంగా తీసాను. ఇప్పుడు నెల్లూరు గల్లిలో జరిగే మాస్ డ్రామా కథతో ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’ తీసాను. ఈ సినిమా జులై 26న రిలీజ్ కానుంది. అలాగే ఇంకో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఒక పక్క డాక్టర్ గా నా బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరో పక్క సినిమాలు నిర్మిస్తూ రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా చాలా సినిమాలు రావాలి అని అన్నారు.