Janta Movie : కొణిదెల పవన్ తేజ్ హీరోగా కొత్త సినిమా.. ఓపెనింగ్ పూజ కార్యక్రమం..
తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం అమలాపురంలో జరిగింది. (Janta Movie)
Janta Movie
Janta Movie : కొణిదెల పవన్ తేజ్, పాడిని కుమార్ జంటగా రాబోతున్న కొత్త సినిమా ‘జంట’. వసుంధర ఆర్ట్స్ బ్యానర్ పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మాణంలో రాజశేఖర్ యాదవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం అమలాపురంలో జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గెస్టులుగా హాజరయ్యారు.
టిడిపి రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ.. ఇక్కడ దసరా బుల్లోడు నుంచి ఎన్నో సినిమాలు షూటింగ్స్ జరుపుకున్నాయి. జంట సినిమా కూడా ఇక్కడ షూట్ చేయడం సంతోషంగా ఉంది. కొణిదెల పవన్ తేజ్ కు హీరోగా ఇది రెండో సినిమా. జంట సినిమాతో కొణిదెల పవన్ తేజ్ మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలి అని అన్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. ఆహ్లాదకర వాతావరణానికి నెలవైన అమలాపురంలో జంట సినిమా షూటింగ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఇక్కడ మరిన్ని సినిమాలు షూటింగ్స్ జరగాలి. అప్పుడే ఇక్కడ వారికి ఉపాధి, ఆదాయం లభిస్తాయి. హైదరాబాద్ లో సినిమా స్టూడియోస్ లా, ఇక్కడ ఉన్న లొకేషన్స్ తో నేచర్ స్టూడియో ఉందని చెప్పచ్చు అని అన్నారు.
Also Read : Teja Sajja : తేజ సజ్జాకు కాబోయే భార్యని చూశారా? ఘనంగా ఎంగేజ్మెంట్.. హాజరయిన సినీ, రాజకీయ సెలబ్రిటీలు..
నిర్మాత రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం రెండేళ్లుగా వర్క్ చేసుకుంటున్నాం. మా సినిమా కంటెంట్ కు తగినట్లు అమలాపురంలోని లొకేషన్స్ యాప్ట్ అవుతాయి. మేము అమలాపురం నుంచే వచ్చాం. ఈ సినిమాతో ఒక యూనిక్, క్రియేటివ్ డైరెక్టర్ టాలీవుడ్ కు రాబోతున్నాడని చెప్పగలను అని అన్నారు. హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ.. మొదట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయాలని అనుకున్నాం. ఆంధ్రా వైపు కూడా మన సినిమాల షూటింగ్స్ జరగాలని మేమంతా డిస్కస్ చేసుకుని అమలాపురంకు షిఫ్ట్ అయ్యాం. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. వేరే మూవీస్ ఆఫర్స్ వచ్చినా నేను ఈ సినిమా కోసం వేచి చూస్తూ వచ్చాను. ఇలాంటి కథ ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. మా సినిమా క్యాప్షన్ ‘యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..’. ఈ క్యాప్షన్ చూసి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ఈ క్యాప్షన్ మా కథకు యాప్ట్ గా ఉంటుంది అని తెలిపారు.

View this post on Instagram
