HDFC Bank FD Rates 2026 : HDFC బ్యాంక్‌లో రూ.1 లక్ష FD చేస్తే ఎంతొస్తుందో తెలుసా? సీనియర్ సిటిజన్లకు బంపర్ వడ్డీ..!
HDFC Bank FD Rates 2026 : సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వరకు వడ్డీ అందిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ FDలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుంది? వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ వివరాలివే..
HDFC Bank FD Rates 2026
- FD చేయాలనుకుంటున్నారా?
- HDFC బ్యాంక్ వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ వివరాలివే
- రూ.1 లక్ష పెట్టుబడితో రెట్టింపు లాభం..
HDFC Bank FD Rates 2026 : హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో.. సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకుని మంచి రాబడి పొందడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.
అలాంటి వారికి HDFC బ్యాంక్ ఎఫ్డీ పథకాలు మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై భారీ వడ్డీ రేట్లను ప్రకటించింది.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎంత వడ్డీ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ :
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందిస్తున్న ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు డిపాజిట్ కాలాన్ని బట్టి 6.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. అంటే.. రూ.1 లక్ష పెట్టుబడితో ఎఫ్డీ ప్రారంభించవచ్చు.
ఉదాహరణకు.. ఒక నిర్దిష్ట కాలపరిమితికి రూ.లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.1,06,923 వరకు పొందే అవకాశం ఉంటుంది. పదేళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెడితే వడ్డీతో కలిపి మొత్తం డబ్బు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది..
సాధారణ ఖాతాదారులకు వడ్డీ ఎంతంటే? :
సాధారణ కస్టమర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ 6.25 శాతం నుంచి 6.60 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. రూ.1 లక్ష ఎఫ్డీ చేస్తే ఎంచుకున్న కాలపరిమితిని బట్టి మెచ్యూరిటీ మొత్తం మారుతుంది. రూ.1,06,398 నుంచి రూ.1,92,445 వరకు పొందవచ్చు..
ఎఫ్డీ చేసే ముందు ఇవి మర్చిపోవద్దు :
అయితే ఎఫ్డీ చేసే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎంతకాలం డబ్బును డిపాజిట్ చేయాలి? మధ్యలో అవసరం వస్తే తీసుకునే అవకాశం ఉందా? వడ్డీపై ఎంత పన్ను పడుతుంది? అనే అంశాలను పరిశీలించాలి. గడువు పూర్తికాకముందే ఎఫ్డీ వెనక్కి తీసుకుంటే ముందస్తు విత్‌డ్రా ఛార్జీలు లేదా పెనాల్టీ పడవచ్చు.
అందుకే కేవలం ఎక్కువ వడ్డీ వస్తోందని పెట్టుబడి పెట్టొద్దు.. మన అవసరాలు, ఆర్థిక పరిస్థితి, పన్ను భారం అన్నీ లెక్కలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం బెటర్.. పెట్టుబడి పెట్టే ముందు HDFC బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో లేటెస్ట్ వడ్డీ రేట్లు, నిబంధనలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి..
