Teja Sajja : తేజ సజ్జాకు కాబోయే భార్యని చూశారా? ఘనంగా ఎంగేజ్మెంట్.. హాజరయిన సినీ, రాజకీయ సెలబ్రిటీలు..
డు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో తేజ సజ్జ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. (Teja Sajja)
Teja Sajja
Teja Sajja : చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తేజ సజ్జా డిఫరెంట్ కాన్సెప్టులతో హీరోగా మంచి మంచి సినిమాలతో మెప్పిస్తున్నాడు. హనుమాన్, మిరాయి సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ చూసిన తేజ సజ్జా తాజాగా మౌర్య అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. నేడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో తేజ సజ్జ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ఈ నిశ్చితార్థానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్లా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హరీశ్ రావు, దర్శకులు రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, కార్తిక్ ఘట్టమనేని, చిరంజీవి, రవితేజ, రానా, శివాజీ, వరలక్ష్మి శరత్ కుమార్, విశ్వప్రసాద్, సాహూ గారపాటి.. ఇలా అనేకమంది సెలబ్రిటీలు హాజరయి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
నేడు నిశ్చితార్థం జరగ్గా డిసెంబరులో రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా కేవలం ఇరుకుటుంబాల మధ్య తేజ సజ్జా వివాహం జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో తేజ సజ్జ – అతనికి కాబోయే భార్య ఫోటో వైరల్ గా మారాయి. నిశ్చితార్థం ఫోటోలు ఇంకా బయటకు రాలేదు.

