Secunderabad Club : క్లబ్ సభ్యుల డేటా సేఫ్…ఎప్పుడు తెరుస్తామో చెబుతాం

క్లబ్ యదావిధిగా తెరిచే అంశంపై సభ్యులందరికీ సమాచారం ఇస్తామని, ప్రస్తుత పరిస్థితుల వల్ల అప్పటివరకు క్లబ్ మూసే ఉంటుందని స్పష్టం చేసింది.

Secunderabad  Club Members Data : సికింద్రాబాద్ క్లబ్..లో ఉన్న సభ్యుల డేటా సురక్షితంగా ఉందని, అగ్నిప్రమాదంతో చాలా నష్టపోయామని పేర్కొంది క్లబ్ మేనేజ్ మెంట్. ప్రమాదానికి సంబంధించిన వివరాలు క్లబ్ లో ఉన్న మెంబర్స్ కు సమాచారం చేర వేసింది. క్లబ్‌లోని కొల్నాడబార్‌, బిలియర్డ్స్ రూం, బాల్‌రూం, మెయిన్‌ రిసిప్షన్‌ నుంచి ఫస్ట్‌ ఫ్లోర్‌కు వెళ్లే చెక్కమెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని తెలిపింది. మెయిన్‌ హాల్‌ పూర్తిగా దగ్ధమైందని, ఈ కారణంగా…భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని వెల్లడించింది. క్లబ్ యదావిధిగా తెరిచే అంశంపై సభ్యులందరికీ సమాచారం ఇస్తామని, ప్రస్తుత పరిస్థితుల వల్ల అప్పటివరకు క్లబ్ మూసే ఉంటుందని స్పష్టం చేసింది.

Read More : Telugu Heroines : తెలుగులో టాప్‌లో సమంత.. ఆ తర్వాతే ఎవరైనా..

2022, జనవరి 16వ తేదీ ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో క్లబ్ లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బ్రిటిష్ కాలంలో నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ 18వ శతాబ్దం..1878లో సికింద్రాబాద్ క్లబ్ ను నిర్మించారు. మొత్తం 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ ఉంది.

Read More : Temple Thieves: పళని దేవాలయానికి చెందిన 400 ఏళ్ల నాటి బంగారు, రాగి సూక్ష్మ ఈటెలు మాయం

రిసెప్షన్ హాల్, క్లబ్ మెంబెర్స్ కోసం కాల్ నెట్ హాల్, బిలిగెడ్స్ స్నూకర్ హల్, వీటిని అనుకొని వెనక కిచెన్..తో పాటు…భవనంపైనే మిలట్రీ అధికారుల కార్యాలయాలున్నాయి. క్లబ్ వెనుక ఆంధ్రాబ్యాంకు ఉంది. మొత్తం నాలుగు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. భవనం వెనుక భాగంలో ఓ పెట్రోల్ బంక్ ఉంది. క్లబ్ లో రూ. 15 లక్షలు కడితేనే మెంబర్ షిప్ ఇస్తారు.

ట్రెండింగ్ వార్తలు