AP CM Chandrababu : ఐదేళ్లు ఏపీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తాం : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : వచ్చే జూలై ఒకటిన మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్ దారులకు రూ.7వేలను సీఎం చంద్రబాబు స్వయంగా ఇవ్వనున్నారు.

AP CM Chandrababu : గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో వచ్చే విజ్ఞాపనలను చూస్తుంటే అర్ధమవుతోందని రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. గత ప్రభుత్వం సరిగా చేయలేదు కావునే ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని ఆయన తెలిపారు.

Read Also : హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలంటూ రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్​లో సీఎం చంద్రబాబుకు భారీ ఎత్తునా వినతులు వెల్లువెత్తాయి. టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలిరావడంతో పార్టీ కార్యాలయం జనంతో కిక్కిరిసిపోయింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సహా వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులను చంద్రబాబు స్వీకరించారు. ప్రజా వినతులు తీసుకునేందుకు ఎక్కువ సమయాన్ని చంద్రబాబు కేటాయించారు.

ప్రజా సమస్యల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తాం :
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధనిపిస్తోందని అన్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల గుంతలు కూడా పూడ్చలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చేవారం నుంచి చర్యలు చేపడతామని తెలిపారు.

జూలై 1 నుంచి ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ :
వచ్చే జూలై ఒకటిన మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్ దారులకు రూ.7వేలను సీఎం చంద్రబాబు స్వయంగా ఇవ్వనున్నారు. పెనుమాకలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో చంద్రబాబు ముచ్చటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు ఫిఛన్లన పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

Read Also : Nitish Kumar : మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా డిమాండ్‌.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని జేడీయూ నిర్ణయం

ట్రెండింగ్ వార్తలు