CM KCR Kadem : కడెం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కడం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం కడెం ప్రాజెక్ట్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

CM KCR Kadem : తెలంగాణ సీఎం కేసీఆర్ కడం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం కడెం ప్రాజెక్ట్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్.

Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు

ఈ నెల 18వ తేదీనే ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం సహకరించకపోవడం, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లలేదు. దీంతో సోమవారం ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వాస్తవానికి ఈ నెల 18వ తేదీనే ఎస్పారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు. అయితే 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉండటం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Heavy Rain Forecast : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..తెలంగాణలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్

16వ తేదీన హనుమకొండకు వెళ్లిన సీఎం కేసీఆర్ 17, 18వ తేదీలలో భద్రాచలం, ఏటూరునాగారంలో పర్యటించారు కేసీఆర్. అక్కడ వరద పరిస్థితులను తెలుసుకున్నారు. అదే విధంగా వరద ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారం చేయాలన్న సీఎం కేసీఆర్.. ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

CM KCR Alert On Floods : అవసరమైన చోట్ల హెలిపాడ్‌లు సిధ్ధం చేసుకోండి-కేసీఆర్

ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులను ఏరియల్ సర్వే చేస్తారు. అదే విధంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకునే చాన్స్ ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకోనున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సీఎం కేసీఆర్ వెంట వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు