Thyroid : థైరాయిడ్ ఆరోగ్యానికి కొబ్బరితో మేలు

ఎండుకొబ్బరిని నమిలితినటం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. అంతేకాకుండా ఎంతో రుచిని ఇస్తుంది. థైరాయిడ్ సమస్యలను కొబ్బరిని తినటం వల్ల అధిగమించవచ్చు.

Thyroid

Thyroid : శరీరం యొక్క జీవక్రియలు సాఫీగా సాగేందుకు థైరాయిడ్ అవసరం. మెడ అడుగుభాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఈగ్రంథి ఉంటుంది. ఈ గ్రంధి నుండి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది. పిల్లల్లో శరీరక ఎదుగుదలకు , లైంకిగక పరిపక్వతకు థైరాయిడ్ గ్రంధి సహాయపడుతుంది. ఇది సరిగా పనిచేయకపోతే ఎత్తు పెరుగుదలలో లోపం, లైంగిక పరిపక్వత, స్త్రీలలో నెలసరి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ధైరాయిడ్ కు సంభందించిన సమస్యలు ఎదురైతే ఉన్నట్లుండి బరువు పెరగటం, బరువు తగ్గటం, మెడ ముందుబాగం లో వాపు, నీరసం, త్వరగా అలసిపోవటం, చర్మం పొడిగా మారటం, మలబద్దకం, మానసిక ఎదుగుదల , శరీరక ఎదుగుదల లోపించటం, నెలసరుల్లో జాప్యం, ముఖం, కాళ్లలో వాపు, అప్పుడే పుట్టిన శిశువుల్లో జాండిస్, చేతులు వణుకుడు, మలవిర్జన వంటి సమస్యలు ఎదురవుతాయి.

సమతుల్య ఆహారం, జీవనశైలిలో మార్పుల ద్వారా థైరాయిడ్ గ్రంధి సక్రమంగా తన విధులు నిర్వర్తించేలా చేయవచ్చు. ధైరాయిడ్ కు మేలు చేసే ఆహారాల్లో కొబ్బరిని అత్యుమ మైన ఆహారంగా చెప్పవచ్చు. కొబ్బరి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి, ఇతర వంటకాల రూపంలోనైనా కొబ్బరి తీసుకోవటం వల్ల థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎంతో మేలు కలుగుతుంది. కొబ్బరి తినటం వల్ల నిధానంగా జీవక్రియలు మెరుగుపడతాయి. కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కవగా ఉంటాయి. ఈ రెండు జీవక్రియకు దోహదం చేస్తాయి.

ఎండుకొబ్బరిని నమిలితినటం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. అంతేకాకుండా ఎంతో రుచిని ఇస్తుంది. థైరాయిడ్ సమస్యలను కొబ్బరిని తినటం వల్ల అధిగమించవచ్చు. ఎండు కొబ్బరిని చట్నీ రూపంలో చేసుకుని తీసుకోవచ్చు. కొబ్బరి నూనె రూపంలో తీసుకున్నా బరువు తగ్గటం, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి అనేక రకాల వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. అయితే హైపో థైరాయిడిజమ్ కు కొబ్బరి ఏవిధంగా ఉపయోగపడుతుందన్న దానిపై సరైన సమాచారం లేదు. హైపోథైరాయిడిజమ్ సమస్యతో బాధపడుతున్న వారు వీలైనంతవరకు వైద్యుని సంప్రదించటం మంచిది. వైద్యుని పర్యవేక్షణలో ఆయన సూచనలమేరకు చికిత్స పొందటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు