Manikrao Thakre: మాణిక్కం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావ్ థాక్రే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్!

మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. పార్టీని నడిపించిన నాయకుడిగా అనుభవం ఉండటంతో మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలు చూసేందుకు ఎంపిక చేసింది.

Manikrao Thakre: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌ని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా తెలంగాణ వ్యవహారాలు చూసిన మాణిక్కం ఠాగూర్‌ను గోవా ఇంఛార్జ్‌గా నియమించింది.

Doordarshan: దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు కేంద్ర ప్రభుత్వం సాయం.. రూ.2,500 కోట్లు కేటాయింపు

మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉంటూ, పార్టీని నడిపించిన నాయకుడిగా అనుభవం ఉండటంతో మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలు చూసేందుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ వర్గానికి, సీనియర్లకు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. రేవంత్ వర్గానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు పని చేస్తున్నారు. రేవంత్ సభలు, సమావేశాలకు హాజరు కావడం లేదు.

వాళ్లంతా రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంక్షోభాన్ని నివారించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కొత్త నేత నియామకం ద్వారానైనా కాంగ్రెస్ పార్టీలోని సంక్షోభం ముగుస్తుందో లేదో చూడాలి.

 

 

ట్రెండింగ్ వార్తలు