Doordarshan: దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు కేంద్ర ప్రభుత్వం సాయం.. రూ.2,500 కోట్లు కేటాయింపు

కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బీఐఎన్‌డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.

Doordarshan: వీక్షకుల్ని, శ్రోతల్ని ఆకట్టుకోవడంలో కొన్నేళ్లుగా వెనుకబడిపోయిన దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు కేంద్రం బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సంస్థల అభివృద్ధి కోసం ప్రసార భారతికి రూ.2,500 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

Manickam Tagore: టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త ఇంఛార్జి.. తప్పుకోనున్న మాణిక్కం ఠాగూర్?

ఈ మేరకు బుధవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బీఐఎన్‌డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రసార భారతి సంస్థకు సంబంధించిన నిర్మాణ సామగ్రిని మెరుగుపర్చుకునేందుకు, ఆధునికీకరించేందుకు, ఇతర పనుల కోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులతో ఓబీ వ్యాన్ల కొనుగోలు, డిజిటల్ అప్‌గ్రేడెషన్, ఎయిర్ స్టూడియోస్, హెచ్‌డీ సర్వీసెస్ వంటి సదుపాయాలు అందుతాయి.

Delhi car horror: అంజలి స్నేహితురాలిపై విమర్శల వెల్లువ.. నువ్వేం స్నేహితురాలివి అన్న స్వాతి మాలివాల్

దూరదర్శన్ సంస్థ ఇరవై ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిధుల్ని కేటాయించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దూరదర్శన్‌కు దేశవ్యాప్తంగా 36 ఛానెళ్లు ఉన్నాయి. ఇందులో 28 ప్రాంతీయ ఛానెళ్లు. ఆల్ ఇండియా రేడియోకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500కు ప్రసార కేంద్రాలున్నాయి. ప్రభుత్వం అందించనున్న నిధుల ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు డీడీ ఉచిత డీటీహెచ్ సర్వీసులు అందించనుంది. మొత్తం ఎనిమిది లక్షల డీటీహెచ్‌లు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు