India Covid : భారత్‌‌లో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే

గత 24 గంటల్లో 22 వేల 270 మంది వైరస్ బారిన పడ్డారు. 325 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

 Fresh COVID-19 Cases : కరోనా రక్కసి నుంచి భారత్ మెల్లిమెల్లిగా బయటపడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా విలయతాండవంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. వేలాది మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ జోరుగా పంపిణీ చేస్తోంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారి సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 22 వేల 270 మంది వైరస్ బారిన పడ్డారు. 325 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Dollar Millionaires : కరోనా కాలంలో భారత్‌లో పెరిగిన డాలర్ మిలియనీర్లు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

ప్రస్తుతం దేశంలో 2,53,739 యాక్టీవ్ కేసులున్నాయని, 0.59 శాతంగా యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. 1.80 శాతానికి రోజువారీ పాజిటివిటి రేటు చేరుకుందని, దేశంలో ఇప్పటివరకు 4,28,02,505 కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 5,11,230గా ఉందని వెల్లడించింది. దేశంలో 98.21 శాతంగా కరోన రికవరీ రేటు ఉందని తెలిపింది. ఒక్క రోజులో కరోనా నుంచి 60,298 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని, దీంతో కోలుకున్న వారి సంఖ్య 4,20,37,536 చేరుకుంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ కంటిన్యూ అవుతోంది.

Read More : Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

గత 400 రోజులుగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 175.03 కోట్ల డోసుల టీకాలు అందజేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం 36,28,578 డోసుల టీకాలు వేసినట్లు, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 175,03,86,834 డోసుల టీకాలు అంద చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు