Assembly Election: ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. మూడు రాష్ట్రాల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో జరుగుతాయి.

Assembly Election: ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే మార్చిలో పూర్తవుతుంది. ఆలోపు కొత్త ప్రభుత్వం ఎన్నికవుతుంది. త్రిపురలో ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదలవుతుంది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 30న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 2 తుది గడువు. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు సంబంధించి జనవరి 31న నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిబ్రవరి 7 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 8న నామినేషన్లు పరిశీలిస్తారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.

Hunt Movie Trailer : చెరిగిపోయిన గతంలో ఎవిడెన్స్‌లు వెతుకుతున్న సుధీర్ బాబు.. ‘హంట్’ మూవీ ట్రైలర్ రిలీజ్..

ప్రస్తుతం త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారంలో ఉంది. ఇది జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి జాతీయ హోదా దక్కించుకున్న ఏకైక పార్టీ ఇదే. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) అధికారంలో ఉంది. అయితే, ఈ సారి అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అన్నింటిపైనా బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవడం తప్పనిసరి అని బీజేపీ భావిస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు