Hunt Movie Trailer : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఒక పక్క గుండెకు హత్తుకునే లవ్ స్టోరీస్ లో నటిస్తూనే మరో పక్క యాక్షన్ మూవీస్ లో ఇరగ గొట్టేస్తున్నాడు. ఈ హీరో నుండి వస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘హంట్’. గన్స్ డోంట్ లై అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతుంది అని అందరికి అర్ధమైంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ కనిపించబోతున్నాడు.
Sudheer Babu Hunt Movie: సుధీర్ బాబు సినిమా “హంట్” టైటిల్ పై వివాదం..
ఇక ఈ మూవీ ట్రైలర్ ని ఇవాళ విడుదల చేశారు మేకర్స్. రెండు నిముషాలు నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఫుల్ ఆన్ సస్పెన్స్ తో నడిచింది. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లోనే సుధీర్ బాబుకి కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల తన జీవితంలోని కొన్ని రోజుల గతాన్ని మర్చిపోతాడు. అయితే ప్రమాదానికి ముందు సుధీర్ బాబు ఒక హై ప్రొఫైల్ కేసు సాల్వ్ చేసే పనిలో ఉంటాడు. యాక్సిడెంట్ వల్ల ఆ కేసు డీటెయిల్స్ మొత్తం మర్చిపోతాడు. దీంతో తన దగ్గర ఉన్న డాక్యూమెంటల్ ప్రూఫ్ ని బట్టి కేసు హంట్ మొదలు పెడతాడు. చివరాఖరికి ఆ కేసుని సాల్వ్ చేశాడా? లేదా? అనేది మిగతా కథ అని అర్ధమవుతుంది.
ఈ సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్ట పడ్డాడు. ఈ మూవీలో భారీగా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. దీంతో సుధీర్ బాబు డూప్ లేకుండా తానే స్టంట్స్ అన్ని చేయడానికి చాలా కసరత్తు చేశాడు. ఇక ఈ సినిమాలో ‘ప్రేమిస్తే’ ఫేమ్ భారత్, సుధీర్ బాబుతో సమానమైన పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో శ్రీకాంత్ మరో ముఖ్య పాత్రలో చేస్తుండగా గోపురాజ్ రమణ, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
మహేష్ సూరపనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా సినిమా మొత్తం మీద ఒక సాంగ్ మాత్రమే ఉండనున్నట్లు తెలియజేశాడు సుధీర్ బాబు. అలాగే హీరోయిన్ కూడా ఉండదు. మొత్తం సీరియస్ యాక్షన్ మోడ్ లో సాగనుంది. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.