KKR vs SRH : నో డౌట్.. హైదరాబాద్ పై కోల్‌కతా గెలుస్తుంది..
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : May 21, 2024 / 04:58 PM IST
Wasim Akram picks KKR as favourites against SRH in Qualifier 1
Wasim Akram – KKR : ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. రెండు జట్లలోనూ బిగ్ హిట్టర్లు ఉండడంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ రెండింటిలో విజయం సాధించి ఫైనల్ చేరుకునే జట్టు ఏదోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు వసీమ్ అక్రమ్ మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలుస్తుందన్నాడు. కేకేఆర్ బౌలింగే అందుకు కారణం అని చెప్పాడు. కేకేఆర్ బౌలింగ్ యూనిట్‌లో నిలకడగా వికెట్లు తీసే బౌలర్లు ఉన్నారన్నాడు. ముంబై, లక్నోతో జరిగిన మ్యాచుల్లో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 15 మంది బౌలర్లలో నలుగురు కేకేఆర్ బౌలర్లు ఉన్నారన్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడానికి ఆ జట్టు బౌలింగ్ యూనిటే కారణం అని చెప్పుకొచ్చాడు.
Junior Rohit Sharma : ఈ బుడ్డోడు జూనియర్ రోహిత్ శర్మ అట.. షాట్లు చూస్తే నమ్మక తప్పదు?
ఫిల్ సాల్ట్ లేకపోవడం నష్టం..
కోల్‌కతా జట్టులో ప్రతి ఒక్కరు ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం అని చెప్పాడు. అయితే.. ఫిల్‌సాల్ట్ లేకపోవడం జట్టుకు నష్టం కలిగిస్తుందన్నాడు. దాదాపుగా ప్రతి ఒక్కరూ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సీజన్‌లో మనీష్ పాండే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. జట్టులో ప్రతి ఒక్కరు సంతోషంగా, నమ్మకంగా ఉన్నారనిపిస్తోంది. వారు దూకుడుగా ఆడుతున్నారు. ఫిల్ సాల్ట్ లేకపోవడమే పెద్ద మైనస్ అవుతుందని అక్రమ్ అన్నాడు.
కాగా.. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో రెండో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా ఫిల్ సాల్ట్ నిలిచాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 182 స్ట్రైక్ రేటుతో 435 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. కాగా.. టీ20 ప్రపంచకప్ ప్రిపరేషన్స్ కోసం ఈ ఇంగ్లాండ్ ఆటగాడు స్వదేశం వెళ్లిపోయాడు.
