Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు

ఆర్‌బీఐ, ఎస్‌బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్‌ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేసేలా ఆర్‌బీఐ, ఎస్‌బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు

Delhi Highcourt – Rs 2000 Note: రెండే రూపాయల నోట్ల మార్పిడికి ధ్రువీకరణ పత్రం తప్పనిసరా అనే విషయమై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, గుర్తింపుకార్డు, ఆధారాలు లేకుండా 2,000 రూపాయల నోట్లు మార్పు చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ఐడీ ప్రూఫ్ తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటీషన్‭ను ధర్మాసనం కొట్టివేసింది.

TSPSC Paper leak: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు

ఇంతకు ముందు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేకుండానే 2,000 రూపాయల నోట్ల మార్పిడికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఆర్‌బీఐ, ఎస్‌బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్‌ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేసేలా ఆర్‌బీఐ, ఎస్‌బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు. ప్రతి ఇంటికీ ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉన్నా కూడా గుర్తింపు అవసరం లేకుండా మార్పిడికి ఎందుకు అనుమతిస్తున్నారని అశ్విని ఉపాధ్యాయ్ వాదించారు.

Bengaluru: మా తాతయ్యను మంత్రి వర్గంలోకి తీసుకోండి.. రాహుల్ గాంధీకి ఏడేళ్ల చిన్నారి లేఖ

కాగా, నోట్ల మార్పిడి అంశం ద్రవ్య విధానానికి సంబంధించినదని, ఇది కోర్టు అధికార పరిధికి మించినది ఆర్‌బీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, దానిని కొట్టివేయాలని హైకోర్టును ఆర్బీఐ తరపు న్యాయవాది కోరారు. రెండు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకపోయినా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవచ్చని తీర్పు వెలువరించింది.

ట్రెండింగ్ వార్తలు