Delhi Metro : ఢిల్లీ మెట్రో డ్రైవర్ చేసిన పని వైరల్.. అనౌన్స్‌మెంట్‌కి బదులు!

మెట్రోలో ఎటువంటి సోషల్ మీడియాలో రీల్స్ వంటివి చేయకూడదు అంటూ రూల్ తెచ్చిన తరుణంలో.. ఢిల్లీ మెట్రో (Delhi Metro) డ్రైవర్ అనౌన్స్‌మెంట్‌కి బదులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Delhi Metro : ఈ మధ్యకాలంలో చిత్ర విచిత్రాలు చేసి ఏదో రకంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలనే కోరిక చాలామందిలో కనిపిస్తోంది. ఈ విషయంలో టీనేజ్ వాళ్లతో ముసలివారు సైతం పోటీపడుతున్నారు. అందుకోసం వారు చేయని ఫీట్లు ఉండట్లేదు. అలా కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఇక ఈ ఫీట్లు చేయడానికి అనువుగా ఉండే ఏ స్థలాన్ని అయినా వాడేసుకుంటున్నారు. అందులో మెట్రో రైళ్లు కూడా వేదికలుగా మారుతున్నాయి.

Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలు మరింత వేగం.. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైళ్లు

ఇందులో ఢిల్లీ మెట్రో (Delhi Metro) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రయాణం సాగుతున్నంత సేపు కొట్లాడుకునేవారు, రీల్స్ (Instagram Reels) చేసుకునేవారు, లవ్ ప్రపోజ్ చేసుకునే ప్రేమ పక్షులు.. ఓ వైపు డ్యాన్స్ లు.. యాక్టింగ్ లు కాదేది ఢిల్లీ మెట్రోకి అనర్హం అన్నట్లుగా ఉంటుంది ప్యాసింజర్ల హంగామా. ఇక తాజాగా ఢిల్లీ మెట్రో డ్రైవర్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెట్రోలో సాధారణంగా ప్రయాణికులకు కొన్ని జాగ్రత్తలు నిర్దేశిస్తూ ప్రకటనలు ప్లే చేస్తుంటారు. అయితే మెట్రో డ్రైవర్ అనౌన్స్ మెంట్ కి బదులు పాటను ప్లే చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది.

కంప్యూటర్ లో ఏం ప్రెస్ చేశాడో ఏమో “2 నంబరీ” సినిమా నుంచి ”హర్యాన్వి” పాట ప్లే కావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హుషారైపోయారు. పాట ప్లే అయిన కొన్ని సెకండ్స్ కి డ్రైవర్ తన తప్పిదం తెలుసుకుని ఆపేశాడు. అయితే ఒక నెటిజన్ ఇదంతా తన కెమెరాలో క్యాప్చర్ చేసి ”Reasong Why I Delhi” అనే క్యాప్షన్ తో తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. మెట్రోల్లో ఇన్ స్టా రీల్స్, డ్యాన్స్ లు చేయరాదని అధికారులు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ప్రయాణికుల చెవికెక్కడం లేదు. మెట్రో ఎక్కడం మొదలు ఇదే పనుల్లో ఉంటున్నారు. అయితే తాజాగా మెట్రో డ్రైవర్ చేసిన పనికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు