T20 World Cup Final: బ్యాట్‌తో చేతుపై కొట్టుకున్నాడు..ఫైనల్ మ్యాచ్‌కు దూరం

న్యూజిలాండ్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ లో అవుట్ అయ్యాడు. తీవ్ర అసహనంతో...బ్యాట్ తీసుకుని..కుడిచేతిపై పొరపాటున చేతిపై కొట్టకోవడంతో కాన్వే చేతికి గాయమైంది.

T20 World Cup final : తన కోపమే తన శత్రువు..తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఊరికే అనలేదు. కోపం వల్ల సమస్యలను తెచ్చుకుంటుంటారు. క్రికెట్ లో అవుట్ కాగానే..తీవ్ర అసహనం, కోపంతో బ్యాట్ లను విసిరేయడం, వికేట్లను తన్నడం..ఇతర క్రీడాకారులపై నోరు పారేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఫలితంగా వారిని మ్యాచ్ కు దూరం చేయడమో..జరిమానాలో విధించడం చేస్తుంటారు. అయితే..ఓ క్రీడాకారుడు కీలకమైన ఫైనల్ మ్యాచ్ కు దూరమయ్యాడు. అవుట్ అయ్యానన్న అసహనంతో బ్యాట్ తో కుడి చేతికి పొరపాటున కొట్టుకున్నాడు. దీంతో అతనికి గాయమైంది.

Read More : PV sindhu in patola saree : పద్మభూషణ్‌ అందుకున్నప్పుడు పీవీ సింధు క‌ట్టుకున్న చీరకు ఎన్ని ప్రత్యేకతలో..

టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆదివారం మ్యాచ్ జరుగనుంది. క్రీడాభిమానులు ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే…న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలకంగా వ్యవహరించే బ్యాట్స్ మెన్ డెవాన్ కాన్వే గాయంతో ఫైనల్ కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కాన్వే రాణించాడు. 167 పరుగుల లక్ష్య చేధనలో ఉండగా..కాన్వే విలువైన 46 పరుగులు చేసి న్యూజిలాండ్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ లో అవుట్ అయ్యాడు. తీవ్ర అసహనంతో…బ్యాట్ తీసుకుని..కుడిచేతిపై పొరపాటున చేతిపై కొట్టుకోవడంతో గాయమైంది. ఈ ఫైనల్ మ్యాచే కాకుండా..భారత్ తో జరిగే టీ 20 సిరీస్ లో కూడా ఆడలేరని తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ కు దూరం కావడం వల్ల కాన్వే బాధ పడుతున్నారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు