Woman Fight: మాస్క్ పెట్టుకోమన్నందుకు పోలీసులతో మహిళ ఫైట్

మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో మాస్క్ పెట్టుకోమన్నందుకు ఓ మహిళ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది

Woman Fight: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ప్రస్తుత ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు సైతం విధించాయి. మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలు జారీచేశాయి. అయితే ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో మాస్క్ పెట్టుకోమన్నందుకు ఓ మహిళ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Film Industry : సినిమాలో కూడా వారసత్వం – డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

మధ్యప్రదేశ్ లోని దేవాస్ పట్టణంలో బుధవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళను మాస్క్ పెట్టుకోవాలంటూ సూచించారు. అయితే తాను రెండు డోసుల టీకా తీసుకున్నందున మాస్క్ అవసరం లేదంటూ సదరు మహిళ జవాబిచ్చింది. మాస్క్ పెట్టుకోనందున ఫైన్ చెల్లించాలంటూ పోలీసులు ఆ మహిళకు చలాన్ విధించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. మహిళ తీరుతో ఆగ్రహించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈక్రమంలో తనను పట్టుకునేందుకు వచ్చిన మహిళా పోలీసును ఆమహిళ తోసివేసింది. అక్కడే ఉన్న మిగతా పోలీస్ అధికారులు ఆమహిళ పై చెప్పుతో దాడి చేసారు. ఈ ఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్త వైరల్ గా మారింది. మాస్క్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించాల్సిన పోలీసులు ఇలా ప్రజలపై దాడి చేయడం ఏమిటంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Pregnant Woman : నాగావళి నదిలో నిండు గర్భిణి అవస్థలు

 

ట్రెండింగ్ వార్తలు