Divyansha Kaushik will play a key role in Vijay Devarakonda Parusuram Mrunal Thakur VD13 Movie
Divyansha Kaushik : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) త్వరలో సమంత(Samantha)తో కలిసి శివ నిర్వాణ(Shiva Niravana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత VD12 జెర్సీ(Jersy) డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఇక విజయ్ దేవరకొండ 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది.
గతంలో పరుశురాం – విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో గీతగోవిందం సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతుండటంతో దీనిపై కూడా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇటీవలే ఈ VD13 సినిమా షూట్ కూడా మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతున్నట్టు సమాచారం. విజయ్ లైగర్ ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు ఇలా వరుసగా సినిమాలు చేస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా VD13 సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని సమాచారం. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ విజయదేవరకొండతో ఈ సినిమాలో నటించనుంది. దివ్యాంశ కౌశిక్ ఆల్రెడీ తెలుగులో మజిలీ, రామారావు ఆన్ డ్యూటీ, మైఖేల్, టక్కర్ సినిమాలతో మెప్పించింది. ఇప్పుడు విజయ్ సరసన VD13 సినిమాతో అలరించనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం.
The Gorgeous Actress #DivyanshaKaushik @itsdivyanshak joins #VijayDeverakonda #VD13
Directed by #Parasuram Produced by #DilRaju
Shooting in progress #ACutAbove @proyuvraaj pic.twitter.com/N2mQgJXfS9
— Ramesh Bala (@rameshlaus) July 19, 2023