Winter Drinks : చలికాలంలో జలుబు,దగ్గు సమస్యలకు చెక్ పెట్టే పానీయాలు

వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. ఈ చిట్కా పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

Winter Drinks : చలికాలంలో జలుబు, దగ్గు అనేవి సహజంగానే వచ్చే ఆరోగ్యసమస్యలు. అలాంటి పరిస్థితిలో బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం అందరికీ చాలా ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన డిటాక్స్ పానీయాలను తీసుకుంటే రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. దాని కోసం ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు.. ఇంట్లో దొరికే వస్తువులతోనే వీటిని తయారు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముఖ్యంగా జీవక్రియను పెంచుకోవాలనుకుంటే ఆపిల్ చాలా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ చేయడానికి 1 ఆపిల్‌ను చిన్న ముక్కలుగా కట్ చేయాలి.. 3 ఖర్జూరాలు, 3 బాదంపప్పులను పాలలో కలపాలి. 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన చియా గింజలను అందులో జోడించండి. ఇనుము, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఈ రసం తాగడం వల్ల కచ్చితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి పెంచే వాటిలో అల్లం, బీట్ రూట్ టీ కూడా ఉపయోగపడతాయి. ఈ టీ చేయడానికి, అల్లం ఒకటి తీసుకోవాలి. అలాగే అరకప్పు నీరు.. దీంతో పాటు తురిమిన బీట్ రూట్ ఒకటి.. తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరిగించి అందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రాళ్ల ఉప్పు , ఎండుమిర్చి కలపాలి. బీట్‌రూట్‌లోని మినరల్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీనిలో నల్ల మిరియాలు, నిమ్మరసం, అల్లంతో వాడడంతో సీజనల్ అలెర్జీలు, జలుబు, దగ్గు, జ్వరాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. ఇలా చేయటం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు , దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి.

ఉసిరి రసం ఉసిరికి ఇది సరైన సీజన్.. ఇంట్లో తయారుచేసిన ఉసిరి జ్యూస్ చేయడం కూడా ఈజీనే.. 4 లేదా 5 ఉసిరికాయలను తీసుకోవాలి.. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోని గింజలను తొలగించాలి. దీన్ని ఒక కప్పు నీటితో కలపాలి. దానికి 1 చిటికెడు నల్ల మిరియాలు, 1 చిటికెడు రాక్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం జోడించాలి. కాస్త తియ్యగా ఉండాలంటే తేనె కలుపుకోవచ్చు. ఒక సాధారణ మిశ్రమాన్ని తయారు చేసి ప్రతి ఉదయం తాగితే మంచి ఫలితం ఉంటుంది. అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఉసిరి రసం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

జలుబు, దగ్గు తగ్గడానికి ఈ తులసి, అల్లం కాంబినేషన్ అద్భుతంగా పని చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల చాలా వేగంగా మీకు మార్పు కనిపిస్తుంది. అల్లం, తులసి ఆకులను నీటిలో కాసేపు మరిగించి తాగండి. పిల్లలకు పెద్దలకూ ఇద్దరికీ చక్కగా పని చేస్తుంది.

తేనె నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనెను వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగండి. వెల్లుల్లి వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి అని చాలా మందికి తెలియదు. వెల్లుల్లిలో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలతో ఉంటుంది. కొన్ని వెల్లుల్లి ముక్కలను బాగా రోస్ట్ చేసి తీసుకోండి. ఇలా రోజుకు ఒకటికి రెండు సార్లు చేయండి. వెల్లుల్లి జలుబును తగ్గిస్తుంది.

ఇలాంటి పానీయాలను సేవించటం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కోనేందుకు అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు