Dulquer Salmaan : రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా సినిమా.. అన్ని ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా దుల్కర్..

నిన్న దుల్కర్ పుటిన రోజు కావడంతో ఒకేసారి చాలా సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి.

Dulquer Salmaan new Pan India movie under Rana Daggubati Production

Dulquer Salmaan Movies : సౌత్ స్టార్స్ లో వర్సెటైల్ యాక్టింగ్ తో ఆడియన్స ని ఎంగేజ్ చేస్తున్నదుల్కర్ సల్మాన్ సౌత్, నార్త్ అన్నతేడా లేకుండా ఎక్కడ చూసినా దుల్కర్ సల్మానే కనిపిస్తున్నారు ఆడియన్స్ కి. లేటెస్ట్ గా మరిన్ని సినిమాల్ని కమిట్ అవుతూ ఫాన్స్ కి దగ్గరవుతున్నారు. నిన్న దుల్కర్ పుటిన రోజు కావడంతో ఒకేసారి చాలా సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి.

తెలుగులో వెంకీ అట్లూరి కాంబినేషన్లో దుల్కర్ చేస్తున్న సినిమాకి టైటిల్ అనౌన్స్ చేశారు. తెలుగులో మహానటి, సీతారామం లాంటి హిట్ సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. దాంతో దుల్కర్ తో సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మన డైరెక్టర్లు. రీసెంట్ గా సార్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి, దుల్కర్ కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ తో చేస్తున్న సినిమాకి ‘లక్కీ బాస్కర్’ అనే టైటిల్ ప్రకటించారు.

తెలుగులోనే కాదు దుల్కర్ తమిళ్ లో కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా సూర్య, సుధకొంగర కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీలో దుల్కర్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మలయాళంలో కింగ్ ఆఫ్ కోత అనే మ్యాసివ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ మూవీస్ చేస్తున్న దుల్కర్ ఇటీవల చుప్ తో బాలీవుడ్ ని మెప్పించి ఇప్పుడు త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ గన్స్ అండ్ గులాబ్స్ తో రాబోతున్నాడు. రాజ్ & డీకే డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్స్ తో ఎంటర్టైన్ చేసిన రాజ్ డికె దుల్కర్, రాజ్ కుమార్ లీడ్ రోల్స్ లో ఈ క్రేజీ సిరీస్ చేస్తున్నారు. ఈ ఇంట్రస్టింగ్ సిరీస్ ఆగస్ట్ 18న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది.

Sreeleela : ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. తెలుగు హీరోయిన్స్ పై కామెంట్స్..

ఇక తాజాగా మరో కొత్త ప్రాజెక్టు ని అనౌన్స్ చేశారు. రానా ఇటీవల తన స్పిరిట్ మీడియాతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రానా నిర్మాతగా కాంత అనే సినిమాని ప్రకటించారు. దుల్కర్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా ఉండబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రానా కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక తన సొంత ఇండస్ట్రీ మలయాళంలో వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా తెలుగు, తమిళ్, మళయాళ, హిందీ.. సౌత్ టూ నార్త్ ఎక్కడ చూసినా వరుస సినిమాలు చేస్తూ దుల్కరే కనిపిస్తున్నారని అంటున్నారు సినీ వర్గాలు.

ట్రెండింగ్ వార్తలు