Top 10 South Movies : నార్త్‌లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సౌత్ సినిమాలు ఇవే.. సగం ప్రభాస్‌వే ఉన్నాయిగా..

నార్త్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సౌత్ సినిమాలు ఇవే..

Top 10 South Movies which Collects Highest Collections in North Prabhas Creates Record with his Movies

Top 10 South Movies : ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తున్నాడు. ప్రభాస్ కల్కి సినిమాతో ఇప్పటికే పలు రికార్డులు సెట్ చేస్తున్నాడు. తన పాత సినిమాల రికార్డులు కూడా బద్దలు కొడుతున్నాడు. కల్కి రిలీజయిన అని చోట్ల ఆల్మోస్ట్ బాహుబలి 2 సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాల రికార్డులు బద్దలు కొడుతున్నాడు ప్రభాస్.

బాహుబలి సినిమా నుంచి నార్త్ లో కూడా మన తెలుగు సినిమాకు ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా పేరుతో మన సినిమాలు దేశమంతటా రిలీజయి మంచి విజయాలు సాధిస్తున్నాయి. కల్కి సినిమా కూడా నార్త్ లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 278 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది.

Also Read : Kanguva Fire Song : సూర్య ‘కంగువ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఫైర్ సాంగ్ అదిరిపోయిందిగా..

అయితే ఇప్పటివరకు నార్త్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సౌత్ సినిమాల లిస్ట్ చూసుకుంటే అందులో సగం ప్రభాస్ వే ఉండటం గమనార్హం. నార్త్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సౌత్ సినిమాలు ఇవే..

బాహుబలి 2 – 511 కోట్లు
KGF 2 – 434 కోట్లు
కల్కి 2898AD – 278 కోట్లు(ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది)
RRR – 274 కోట్లు
రోబో 2 – 189 కోట్లు
సలార్ – 153 కోట్లు
సాహో – 143 కోట్లు
బాహుబలి 1 – 118 కోట్లు
పుష్ప – 108 కోట్లు
కాంతార – 79 కోట్లు

ఇలా టాప్ 10 సినిమాలో అయిదు సినిమాలు ప్రభాస్ వే ఉండటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు