Kanguva Fire Song : సూర్య ‘కంగువ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఫైర్ సాంగ్ అదిరిపోయిందిగా..

తాజాగా నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా కంగువ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఫైర్ సాంగ్' రిలీజ్ చేశారు.

Kanguva Fire Song : సూర్య ‘కంగువ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఫైర్ సాంగ్ అదిరిపోయిందిగా..

Suriya Kanguva Movie First Song Fire Song Released

Updated On : July 23, 2024 / 12:43 PM IST

Suriya Kanguva Fire Song : తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కంగువ సినిమా పైనుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, పోస్టర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Rajamouli – Netflix : తెలుగు హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంటి.. రాజమౌళి డాక్యుమెంటరీ.. నెట్ ఫ్లిక్స్ ప్రయోగంపై విమర్శలు..

‘కంగువ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా కంగువ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ రిలీజ్ చేశారు. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ అదిరిపోయాయి. తెలుగులో ఈ పాటని శ్రీమణి రాయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో అనురాగ్ కులకర్ణి పాడారు. ‘ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల.. ‘ అంటూ సాగే కంగువ ‘పైర్ సాంగ్’ ని మీరు కూడా వినేయండి..