Aishwarya Rai: మరోసారి తల్లి కాబోతున్న ప్రపంచ సుందరి?

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి తల్లి కాబోతుందా.. అంటే నేషనల్ మీడియా అవుననే అంటుంది. ఐష్, అభిషేక్ బచ్చన్ లకు ఇప్పటికే ఆరాధ్య అనే..

Aishwarya Rai: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి తల్లి కాబోతుందా.. అంటే నేషనల్ మీడియా అవుననే అంటుంది. ఐష్, అభిషేక్ బచ్చన్ లకు ఇప్పటికే ఆరాధ్య అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య మొదటి సారి తల్లయి పదేళ్లవుతోంది. తల్లైన తర్వాత కూడా సినిమాలలో నటించిన ఐష్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌ కొత్త సినిమాలు కూడా ఏమీ కమిట్‌ కాకపోగా.. ప్ర‌స్తుతం మణిరత్నం దర్శకత్వంలో హిస్టారికల్‌ ఫిక్షన్‌ స్టోరీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో మాత్రమే నటిస్తుంది.

Prabhas: రెబల్‌ స్టార్ పాన్‌ వరల్డ్ సినిమా.. కొరియన్ భామతో రొమాన్స్!

కాగా, ఐష్ ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుందని వార్తలొస్తున్నాయి. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య భర్త అభిషేక్‌, కూతురు ఆరాధ్యలతో కలిసి కనిపించింది. ఈ సమయంలో మీడియా కవర్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆ సమయంలో ఐష్ ఒక్కసారిగా చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగ్‌ని పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో నేషనల్ మీడియా మరోసారి తల్లి కాబోతున్న ఐష్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది.

Sreeja-Kalyan Dev: విడాకుల రూమర్స్‌కు కళ్యాణ్ దేవ్ స్వీట్ ఆన్సర్!

ఇప్పటివరకు ఐశ్వర్య కాని, బచ్చన్‌ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు కానీ ఎయిర్ పోర్టులో ఐష్ బెల్లీ కవర్ చేసే ప్రయత్నం వీడియో మాత్రం వైరల్ గా మారుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఔను నిజమే బచ్చన్ కుటుంబానికి వారసుడు రాబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ వార్తలపై బచ్చన్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు