NTR Childrens : ఫ్యామిలీతో దేవర షూటింగ్‌కి ఎన్టీఆర్.. ఎన్టీఆర్ పిల్లల్ని చూశారా..? అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు..

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కనపడ్డాడు.

NTR Childrens : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర సినిమా గోవాలో ఓ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు దేవర షూట్ థాయ్‌లాండ్ లో జరగనున్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్ కి వెళ్తున్నాడు. ఓ పక్క షూట్ చేస్తూనే థాయ్‌లాండ్ వెకేషన్ కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఇలా ఫ్యామిలీని తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కనపడ్డాడు. దీంతో ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విజువల్స్ లో ఎన్టీఆర్ పిల్లలని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయారా, చిన్నోడు భార్గవ్ రామ్ ఎంత క్యూట్ గా ఉన్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Akira Nandan – Pawan Kalyan : తండ్రి లాగే కొడుకు.. వైరల్ అవుతున్న అకిరా నందన్ హెయిర్ స్టైల్ మేనరిజం..

ఎయిర్ పోర్ట్ లో చిన్న కొడుకు భార్గవ్ తారక్ చెయ్యి పట్టుకొని నడుస్తుంటే వెనక పెద్ద కొడుకు అభయ్ ప్రణతి చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు. థాయ్‌లాండ్ లో దేవర షూటింగ్ ఒక షెడ్యూల్ జరగబోతుందని తెలుస్తుంది. దేవర సినిమా అంతా సముద్రాల దగ్గర జరిగే కథే అని గతంలో డైరెక్టర్ కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే దేవర షూటింగ్స్ అన్ని రియల్ సముద్రాలు ఉన్న చోటే తీస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు