Akira Nandan – Pawan Kalyan : తండ్రి లాగే కొడుకు.. వైరల్ అవుతున్న అకిరా నందన్ హెయిర్ స్టైల్ మేనరిజం..

తాజాగా అకిరా నందన్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా రీ రిలీజ్ అవడంతో థియేటర్ కి వెళ్లి మరీ చూశాడు.

Akira Nandan – Pawan Kalyan : తండ్రి లాగే కొడుకు.. వైరల్ అవుతున్న అకిరా నందన్ హెయిర్ స్టైల్ మేనరిజం..

Pawan Kalyan Akira Nandan Style looks like Pawan Videos goes Viral

Akira Nandan – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఇటీవల బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొన్ని రోజుల పాటు పవన్ వెంటే ఉన్నాడు. పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి తన కొడుకుని తీసుకెళ్లాడు. దీంతో అకిరా నందన్ ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. గతంలో అకిరా తన తండ్రి లాగే కొన్ని లుక్స్ లో కనిపిస్తున్నాడని, పోలికలు బాగానే వచ్చాయని కామెంట్స్ చేసారు.

Also Read : Nikhil Siddhartha : హీరో నిఖిల్ కొడుకు పేరేంటో తెలుసా? ఈవెంట్లో లీక్ చేసేసిన నిఖిల్..

తాజాగా అకిరా నందన్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా రీ రిలీజ్ అవడంతో థియేటర్ కి వెళ్లి మరీ చూశాడు. థియేటర్లోకి వెళ్తున్నప్పుడు, బయటకి వచ్చేటప్పుడు అకిరా నందన్ వీడియోలు వైరల్ గా మారాయి. ఓ వీడియోలో అకిరా తన జుట్టు పైకి అనుకుంటూ కనపడ్డాడు. పవన్ కళ్యాణ్ కూడా రెగ్యులర్ గా తన జుట్టుని పైకి అనుకుంటూ ఓ స్వాగ్ చూపిస్తాడు. అకిరా కూడా అచ్చం పవన్ లాగే మేనరిజం చూపించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. తండ్రి లాగే కొడుకు కూడా స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు కదా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.