Sreeja-Kalyan Dev: విడాకుల రూమర్స్‌కు కళ్యాణ్ దేవ్ స్వీట్ ఆన్సర్!

టాలీవుడ్ స్వీట్ కపుల్ నాగచైతన్య-సమంతల విడాకులతో తెలుగు ఇండస్ట్రీలో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఒక్క సామ్-చైతూ మాత్రమే కాదు.. మరో పెద్ద ఫ్యామిలీలో..

Sreeja-Kalyan Dev: టాలీవుడ్ స్వీట్ కపుల్ నాగచైతన్య-సమంతల విడాకులతో తెలుగు ఇండస్ట్రీలో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఒక్క సామ్-చైతూ మాత్రమే కాదు.. మరో పెద్ద ఫ్యామిలీలో కూడా మరో విడాకుల బాంబ్ పేలనుందని గాసిప్ రాయుళ్లు కథలు అల్లారు. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోనుందని ఈ జంట విడాకుల ఆలోచనలో ఉందని తీవ్ర ప్రచారం జరుగుతుంది.

Godfather: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ కోసం సల్లు భాయ్?

సహజంగా మెగా ఫ్యామిలీలో ఏ చిన్న వేడుకైనా అల్లుడు కళ్యాణ్ దేవ్ తప్పక ఉంటాడు. అయితే.. ఈ మధ్య జరిగిన సాయి ధరమ్ తేజ్ ఇంట్లో వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలందరూ హాజరయ్యారు. కానీ ఇక్కడ కళ్యాణ్ దేవ్ మిస్సయ్యాడు. దీంతో విడాకుల ప్రచారం నిజమేనని మరింత ప్రచారం జరగగా మెగా అభిమానులలో కూడా కాస్త ఆందోళన నెలకొంది. అయితే, ఈ ప్రచారానికి కళ్యాణ్ దేవ్ ఇప్పుడు స్వీట్ ఆన్సర్ ఇచ్చేశాడు.

Rakul Preeth Sing : కండోమ్ టెస్టర్ గా రకుల్.. షాక్ లో ఫ్యాన్స్

తాజాగా కల్యాణ్‌దేవ్‌ ఒక్క ఫోటోతో రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. భార్య శ్రీజ బర్త్‌డే సందర్భంగా..హ్యాపీ బర్త్‌డే స్వీటూ అంటూ లవ్‌ సింబల్‌ను జతచేస్తూ ఫోటోను పోస్ట్‌ చేయగా.. దానికి శ్రీజ ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ట్యాగ్‌ చేశాడు. దీంతో ఇప్పటి వరకు విడాకులంటూ ప్రచారం చేసినా గాసిప్ రాయుళ్లకి పచ్చి వెలక్కాయ పడ్డ పరిస్థితిగా మారింది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా కల్యాణ్‌ దేవ్‌ ఇటీవలే సూపర్‌ మచ్చి, కిన్నెరసాని షూటింగ్స్‌ పూర్తి చేయగా త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు