Guruvayur Temple: రూ.1,700 కోట్లు, 260 కేజీల బంగారం, 271 ఎకరాలు.. గురువాయూర్ గుడి ఆస్తులివి

ఇవే కాకుండా 6,605 వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఇది 5,359 వివిధ లాకెట్లు, నాణేలు ఇతర వస్తువుల రూపంలో ఉందట. దీని విలువ కూడా ఎంతో వెల్లడించలేదు. గురువాయూర్ ప్రాంతానికి చెందిన ప్రాపర్ ఛానల్ అనే సంస్థ అధినేత ఎంకే హరిదావ్ వేసిన ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బయటికి వెల్లడైంది

Guruvayur Temple: కేరళలోని పద్మనాభ స్వామి గుడిలోని ఆరవ గదిలో లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఉందని అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. వాస్తవానికి ఏదీ తేల్చకుండాన ఆ విషయం మరుగున పడింది. ఇక తాజాగా అదే రాష్ట్రానికి చెందిన మరో గుడికి చెందిన ఆస్తులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అయితే పద్మనాభ స్వామి గుడిలో లాగ ఇవేవీ గదిలో దాచిన రహస్య ఆస్తులు కాదు కానీ, బయటికి వెల్లడించకుండా బ్యాంకులో చేసిన డిపాజిట్లు. కానీ ఒక గుడి నుంచి ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లు ఉండడం తీవ్ర చర్చకు దారి తీసింది.

Ramesh Jarikiholi: ఓటుకు రూ.6,000 ఇస్తాను.. పబ్లిక్‭గా ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే

ఈ గుడికి సంబంధించిన వివరాలు అడిగినప్పుడు ఆలయ భద్రత దృష్ట్యా బయటికి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కానీ, తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు మాత్రం కొంత వరకు వివరాలు వెల్లడించారు. ఆ వివరాలే కళ్లు చెదిరేలాగ కనిపించాయి. ఈ గుడి పేరు మీద బ్యాంకులో డిసెంబరు నాటికి 1,737.04 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 19,981 వేల బంగారు లాకెట్లు, బంగారు నాణెలు సహా ఇతర వస్తువుల రూపంలో మొత్తం 263.637 కిలోల బంగారం ఉందట. వీటితో పాటు ఈ గుడి పేరు మీద 271.05 ఎకరాల భూమి ఉన్నట్లు ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

KS Bhagwan: రాముడు ఆదర్శవంతుడు కాదు, 11 వేళ్ల ఏళ్లు పాలించనూ లేదు.. కన్నడ రచయిత హాట్ కామెంట్స్

అయితే బంగారం, భూమి విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇవే కాకుండా 6,605 వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఇది 5,359 వివిధ లాకెట్లు, నాణేలు ఇతర వస్తువుల రూపంలో ఉందట. దీని విలువ కూడా ఎంతో వెల్లడించలేదు. గురువాయూర్ ప్రాంతానికి చెందిన ప్రాపర్ ఛానల్ అనే సంస్థ అధినేత ఎంకే హరిదావ్ వేసిన ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బయటికి వెల్లడైంది. ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమం విషయంలో దేవస్థానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ కారణంగానే ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు కోరాల్సి వచ్చిందని హరిదాస్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు